ప్రముఖ బాలీవుడ్ నటి.. నిర్మాత ట్వింకిల్ ఖన్నా హైదరాబాద్లో సందడి చేశారు. నగరంలోని ఓ హోటల్లో ఫిక్కీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. 'ది ఫన్నీ సైడ్ ఆఫ్ లైఫ్' అనే అంశంపై చెబుతూ తన జీవిత విశేషాలు, సంతోషకరమైన జీవితం గడపాల్సిన అవసరంపై ఆమె ప్రసంగించారు.
మల్టీ టాస్కింగ్ మహిళల జీవితంలో అత్యంత సాధారణమైపోయిందని ఆమె అన్నారు. సరైన సమయానికి సరైన నిర్ణయం తీసుకుని ముఖ్యమైన పనులకు ప్రాధాన్యమిస్తే అన్ని పనులు పూర్తిచేయవచ్చని ట్వింకిల్ ఖన్నా తెలిపారు.
ఇదీ చూడండి: 'ప్రత్యేక' ఆర్టీసీ ఉద్యోగులకు శిక్షణ ప్రారంభం