ETV Bharat / state

'కానిస్టేబుల్ ఎంపికలో నార్మలైజేషన్​ పద్ధతిని రద్దు చేయాలి'

author img

By

Published : Nov 4, 2019, 7:54 PM IST

కానిస్టేబుల్​ ఎంపిక ప్రక్రియలో తీసుకున్న నార్మలైజేషన్​ పద్ధతిని రద్దుచేసి... మెరిట్​ మార్కుల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయాలని బాధితులు డిమాండ్​ చేశారు.

'నార్మలైజేషన్​ పద్ధతిని రద్దుచేయాలి'
'నార్మలైజేషన్​ పద్ధతిని రద్దుచేయాలి'

కానిస్టేబుల్ ఎంపిక పక్రియలో తీసుకున్న నార్మలైజేషన్ పద్ధతిని తక్షణమే రద్దుచేసి... మెరిట్ మార్కులతో అర్హత సాధించిన అభ్యర్థులకు న్యాయం చేయాలని అభ్యర్థులు డిమాండ్ చేశారు. ఈ పద్ధతితో అర్హత కలిగిన తాము తీవ్రంగా నష్టపోయామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్​లోని ​బషీర్​బాగ్ ప్రెస్​క్లబ్​లో 'కానిస్టేబుల్ ఫలితాలు, అవకతవకలు, ఆత్మబలిదానాలు, స్పందించని బోర్డ్' అనే అంశంపై అభ్యర్థులు సదస్సు నిర్వహించారు. తెలంగాణ ఐకాస నాయకుడు ఆచార్య పురుషోత్తం పాల్గొని వారి డిమాండ్లకు మద్దతు తెలిపారు. నార్మలైజేషన్ పద్ధతి వల్ల 110 మార్కులు సాధించిన అభ్యర్థులకు 90 మార్కులు వేసి అనర్హులుగా ప్రకటించడాన్ని వారు తప్పుపట్టారు. ఈ వ్యవహారంపై నవంబర్ 5న న్యాయస్థానం తీర్పు వెలువరించనున్న నేపథ్యంలో... రిక్రూట్ మెంట్ బోర్డ్ అవకతవకలను సరిచేసి మెరిట్ అభ్యర్థులకు ఉద్యోగాలు కేటాయించాలని వారు డిమాండ్ చేశారు. తీర్పు తమకు అనుకూలంగా రాకపోతే సుప్రీం కోర్టును ఆశ్రయిస్తామని అభ్యర్థులు స్పష్టం చేశారు.

ఇదీ చూడండి: పార పట్టి మురికి కాలువను శుభ్రం చేసిన మంత్రి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.