Aadhar Update Issues : రాష్ట్రవ్యాప్తంగా ప్రజాపాలన కార్యక్రమానికి ఎవరూ ఊహించని స్పందన లభిస్తోంది. గత బీఆర్‍ఎస్ పాలనలో కొత్త రేషన్ కార్డులు ఇవ్వకపోవడం, ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీలను ప్రవేశపెట్టడంతో ప్రతి దరఖాస్తు సెంటర్ వద్ద జనజాతర కనిపిస్తోంది. గతంలో సమగ్ర కుటుంబ సర్వే జరిగిన సమయాల్లో జనాలు తాము ఉండే వివిధ ప్రాంతాల నుంచి సొంత గ్రామాలకు తరలివచ్చినట్లే ప్రజాపాలన కార్యక్రమానికి తరలివెళ్తున్నారు.
Queue At Aadhar Centers Telangana : అధికారులు దరఖాస్తులు అందించే వరకు ప్రతి జిల్లాలో వేలాది మంది ప్రజలకు ఆధార్ కార్డు ప్రాధాన్యం ఏంటో పూర్తి స్థాయిలో అర్థం కాలేదు. ఇప్పటికప్పుడు ప్రజాపాలన కౌంటర్ల నుంచి ఆధార్ సెంటర్లకు పరుగులు తీస్తున్నారు. ప్రజాపాలన సెంటర్ల వద్ద కంటే ఎక్కువగా ఆధార్ సెంటర్లు జనాలతో నిండిపోతున్నాయి.
ఆధార్ కార్డుల్లో ఇంకా ఆంధ్రప్రదేశ్ : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి ముందే ఆధార్ కార్డులు రావడంతో అప్పట్లో జనాలు వాటిని పొందారు. ఎవరో కొందరు అప్‍డేట్ చేసుకోవడం మినహా ఎక్కువ మంది కార్డుల్లోనూ ఇంకా రాష్ట్రం పేరు ఆంధ్రప్రదేశ్గానే ఉంది. అయితే బ్యాంకు ఖాతాలు తెరిచేటపుడు, లోన్లు తీసుకునే సమయాల్లో మామూలుగా ఆంధ్రప్రదేశ్ స్థానంలో తెలంగాణ పేరు మార్చుకోవాలని అధికారులు ప్రజలకు సూచిస్తున్నారు. ప్రస్తుతం ప్రజాపాలన కార్యక్రమం సందర్భంగా ఇన్నాళ్లు మూలన పెట్టిన ఆధార్ కార్డులను ప్రజలు బయటకు తీశారు. ప్రజాపాలన సెంటర్లలో దరఖాస్తులు తీసుకోడానికి ఇబ్బంది పడే వారి పరిస్థితిని జిరాక్స్ సెంటర్ల నిర్వాహకులు క్యాష్ చేసుకుంటున్నారు. ఇదే అదనుగా చాలా చోట్ల జిరాక్స్ సెంటర్లలో ఒక్కో దరఖాస్తును రూ.40 నుంచి 50 వరకు వసూలు చేసి విక్రయిస్తున్నారు.
ప్రజాపాలన కార్యక్రమంలో గలాటా - ఎంపీపీ, ప్రజల మధ్య వాగ్వాదం
ఉదయం 7 నుంచే ఆధార్ సెంటర్లు ఫుల్ : రాష్ట్ర సర్కార్ ఇస్తామన్న ఆరు గ్యారంటీలకు తోడు కొత్త రేషన్ కార్డుల కోసం జనాలు ప్రజాపాలన సెంటర్ల వద్ద ఎగబడుతున్నారు. కాగా, రేషన్ కోసం ఆధార్ కార్డు కంపల్సరీ అని చెప్పడంతో ఇన్నాళ్లు పిల్లలకు ఆధార్ కార్డు తీసుకొని వారంతా ఆధార్ సెంటర్ల వద్దకు ఉరుకులు పరుగులు తీస్తున్నారు.
ఆధార్ కేంద్రాల్లో అందుబాటులో ఉండే సిబ్బంది రోజుకు 100 లోపు మాత్రమే అప్లికేషన్లు తీసుకునే అవకాశం ఉండగా, చాలా కేంద్రాలకు వేల మంది తరలివెళుతున్నారు. ఐదారేళ్ల పిల్లలతో పాటు కొన్ని రోజుల క్రితం పుట్టిన పిల్లలతో బాలింతలు పెద్ద ఎత్తున ఆధార్ సెంటర్ల వద్ద బారులు తీరతూ పిడిగాపులు కాస్తున్నారు. ఒక్కొక్కరికి పావుగంట కంటే ఎక్కువ సమయం పట్టడంతో ఉదయం 7 గంటల నుంచే ఆధార్ సెంటర్లన్నీ నిండిపోయాయి. సాయంత్రం సెంటర్లు క్లోజ్ చేసే వరకు వందలాది మంది క్యూలో వేచిచూస్తున్నారు.
ప్రజాపాలనకు విశేష స్పందన- తొలిరోజు 7,46,414 అప్లికేషన్లు
రాష్ట్రంలో ప్రజాపాలన కార్యక్రమం - ఐదు గ్యారంటీల దరఖాస్తులు ఇచ్చేందుకు పోటెత్తిన జనం