హైదరాబాద్ ఉస్మానియా వర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ జగన్ ఇంట్లో మహబూబ్నగర్ పోలీసులు సోదాలు నిర్వహించారు. మావోయిస్టులకు సహకరిస్తున్నారనే ఆరోపణలతో అతని ఇంట్లో తనిఖీలు చేపట్టారు. మావోయిస్టుల కరపత్రాలు, ల్యాప్టాప్లను స్వాధీనం చేసుకున్నారు. జగన్ను అదుపులోకి తీసుకుని అతనిపై కేసు నమోదు చేశారు. మావోయిస్టులకు సహకరిస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో పోలీసులు విచారిస్తున్నారు.
ఇదీ చూడండి : ప్లాస్టిక్ కవర్ల తయారీ కంపెనీలపై జీహెచ్ఎంసీ కొరడా