ETV Bharat / state

YS Sharmila Tweet Today : 'రాహుల్ జీ.. థ్యాంక్యూ.. రాజశేఖర్​రెడ్డిని మీ గుండెల్లో పెట్టుకున్నందుకు'

Raghul Gandi Tweet on YSR Birth Anniversary : దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్​ రాజశేఖర్​ రెడ్డి 74వ జయంతి సందర్భంగా కాంగ్రెస్​ అగ్రనాయకుడు రాహుల్​ గాంధీ ట్విటర్​ వేదికగా నివాళులు అర్పించారు. దీనిపై వైఎస్సాఆర్​ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్​ షర్మిల స్పందించి ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు ఆమె ట్వీట్ చేశారు.

YSR 74th Birth Anniversary
YSR 74th Birth Anniversary
author img

By

Published : Jul 8, 2023, 6:43 PM IST

Raghul Gandi Tweet on YSR 74th Birth Anniversary : దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆయనకు నివాళులు అర్పించారు. వైఎస్సార్ దార్శనికత ఉన్న నాయకుడు అని కొనియాడారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల అభ్యున్నతి కోసం తన జీవితాన్ని అంకితం చేసిన నాయకుడని రాహుల్ గాంధీ ట్విటర్​ వేదికగా తెలిపారు. వైఎస్సార్ చిరస్మరణీయ నేత అని ట్వీట్​లో పేర్కొన్నారు.

  • My tributes to senior Congress leader and former Chief Minister of Andhra Pradesh, YS Rajasekhara Reddy ji, on his birth anniversary.

    He was a visionary leader who devoted his life to the betterment of the people of Andhra Pradesh. He shall always be remembered. pic.twitter.com/K5pWWwiWj0

    — Rahul Gandhi (@RahulGandhi) July 8, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

Sharmila reaction on Rahul Gandi Tweet : రాహుల్​ గాంధీ చేసిన ఈ ట్వీట్​పై వైఎస్సాఆర్​ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ట్విటర్​ వేదికగా స్పందించారు. తన తండ్రి పట్ల ఎంతో ప్రేమాభిమానాలతో స్పందించిన రాహుల్ గాంధీకి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆమె సైతం వైఎస్సాఆర్​ గురించి ట్వీట్​ చేశారు. ప్రజాసేవ కోసం నిబద్ధతతో పని చేసిన కాంగ్రెస్ నేత వైఎస్సార్ అని పేర్కొన్నారు. చివరి క్షణం వరకు వైఎస్సాఆర్​ ప్రజాసేవలోనే గడిపారని గుర్తు చేసుకున్నారు. రాహుల్ గాంధీ నాయకత్వంలో దేశానికి ఉజ్వల భవిష్యత్ ఉంటుందని.. తన తండ్రి నమ్మారని ట్విటర్​ వేదికగా వెల్లడించారు. నాడు వైఎస్ అమలు చేసిన పథకాలే.. ఈ రోజుకూ దేశవ్యాప్తంగా సంక్షేమ పాలనకు మార్గదర్శకాలుగా నిలుస్తున్నాయన్నారు. డాక్టర్ వైఎస్సార్​ను స్మరించుకున్నందుకు రాహుల్ గాంధీకి షర్మిల కృతజ్ఞతలు తెలిపారు.

  • Thank you @rahulgandhi ji for your affectionate words, reminiscing late Dr YS Rajashekara Reddy on his birth anniversary. Dr YSR was a committed Congress leader who died in the service of Telugu people, believing in the bright future for this country under your leadership.
    His… https://t.co/M57jRgX9nT

    — YS Sharmila (@realyssharmila) July 8, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

YSR 74th birth anniversary ఇడుపులపాయలో వైఎస్ఆర్ 74వ జయంతి వేడుకలు.. హాజరైన షర్మిల, విజయమ్మ.!
YS Sharmila about YSR : రాజశేఖర్ రెడ్డి 74వ జయంతి సందర్భంగా ఆయనను ప్రేమించే, అభిమానించే ప్రతి హృదయానికి రాజశేఖర్ రెడ్డి బిడ్డ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటుందని షర్మిల తెలిపారు. ఆయన ఎంత గొప్ప నాయకుడో.. తెలుగు ప్రజల సంక్షేమం కోసం ఎంతగా కృషి చేశారో అందరికీ తెలుసని.. ముఖ్యమంత్రిగా మొట్టమొదటి సంతకం రైతుల కోసమే పెట్టారని గుర్తు చేాశారు. రుణమాఫీ, ఫీజు రీయింబర్స్​మెంట్, ఆరోగ్య శ్రీ ఆయనకే సాధ్యమయ్యాయని తెలిపారు. కేవలం 5 సంవత్సరాల్లో.. 46 లక్షల పేదలకు ఇందిరమ్మ ఇళ్లని కట్టించారని పేర్కొన్నారు. మైనార్టీలకు 4 శాతం రిజర్వేషన్లు అందించారని వివరించారు. పోడు భూములకు, అసైన్డ్ భూములకు పట్టాలు ఇప్పించారని తెలిపారు. ప్రతి వర్గంలోనూ, ప్రతి ఒక్కరి హృదయంలో చోటు సంపాదించుకున్న మహానీయుడని కొనియాడారు.
ఇదిలా ఉండగా.. ఖమ్మం జిల్లాలోని పాలేరు పార్టీ కార్యాలయంలో వైఎస్సాఆర్​ విగ్రహాన్ని షర్మిల ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వైఎస్సాఆర్​ పాలన ప్రతి ఒక్కరికీ అందిస్తానని హామీ ఇచ్చారు. ప్రజా ప్రస్థానం పాదయాత్ర మళ్లీ కొనసాగిస్తానని.. అతి త్వరలోనే పాదయాత్ర పున:ప్రారంభం అవుతుందని చెప్పారు. 4 వేల కిలోమీటర్ల ప్రస్థానం పాలేరు గడ్డ మీదనే పూర్తి చేస్తానని పేర్కొన్నారు. పాలేరు గడ్డ వైఎస్సార్ బిడ్డకు అడ్డా అని స్పష్టం చేశారు.

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.