ETV Bharat / state

2BHK Flats Lucky Draw in Hyderabad Today : GHMC పరిధిలో రెండో విడత డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్ల పంపిణీకి లక్కీ డ్రా - Second Phase Double Bedroom Flats Lucky Draw

2BHK Flats Lucky Draw in Hyderabad Today: జీహెచ్​ఎంసీ పరిధిలో రెండో విడత డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్ల పంపిణీకి సర్వం సిద్ధమైంది. ఇవాళ ఉదయం హైదరాబాద్ కలెక్టరేట్‌లో ఆన్‌లైన్‌ డ్రా తీయనున్నారు. ఎన్​ఐసీ ఆధ్వర్యంలో రూపొందించిన ప్రత్యేక సాఫ్ట్‌వేర్ ద్వారా ర్యాండమైజేషన్ పద్ధతిలో మంత్రులు, ఉన్నతాధికారులు, లబ్దిదారుల సమక్షంలో డ్రా తీయనున్నారు. ఇందులో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలకు చెందిన లబ్దిదారులను ఎంపిక చేయనున్నారు.

2nd Phase 2BHK Lucky Draw in GHMC Today
2nd Phase 2BHK Lucky Draw
author img

By ETV Bharat Telangana Team

Published : Sep 15, 2023, 10:51 AM IST

2BHK Flats Lucky Draw in Hyderabad Today : జీహెచ్​ఎంసీ పరిధిలో రెండో విడత డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్ల పంపిణీకి అంతా సిద్ధమైంది. ఇవాళ ఉదయం హైదరాబాద్ కలెక్టరేట్​లో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల ఎంపిక ప్రక్రియ(2BHK Flats Lottery) జరగనుంది. ఎన్ఐసీ ఆధ్వర్యంలో రూపొందించిన ప్రత్యేక సాఫ్ట్​వేర్ ద్వారా ర్యాండమైజేషన్ పద్ధతిలో మంత్రులు, ఉన్నతాధికారులు, లబ్దిదారుల సమక్షంలో ఆన్​లైన్ డ్రా తీయనున్నారు. ఇందులో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలకు చెందిన లబ్దిదారులను ఎంపిక చేయనున్నారు. రెండో విడతలో ప్రభుత్వం 13,300 ఇళ్లను ప్రభుత్వం పంపిణీ చేయనుంది.

Double Bedroom Flats Second Phase Lucky Draw : రెండో విడత డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పంపిణీకి సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్(Minister Talasani Srinivas Yadav) అధ్యక్షతన హైదరాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో లబ్దిదారుల ఎంపిక ప్రక్రియ జరగనుంది. ఎంతో పారదర్శకంగా ఎన్ఐసీ ఆధ్వర్యంలో రూపొందించిన ప్రత్యేక సాఫ్ట్​వేర్(Special Software) ద్వారా ర్యాండమైజేషన్ పద్ధతిలో ఆన్​లైన్ డ్రా(Online Draw) తీయనున్నారు.

Double Bedroom Flats Second Phase Lucky Draw in Hyderabad : ఈ డ్రా కార్యక్రమంలో డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్, మంత్రులు మహమూద్ అలీ, హరీశ్​రావు, సబిత ఇంద్రారెడ్డి, మల్లారెడ్డి, మహేందర్ రెడ్డి, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత రెడ్డి, ఎంపీలు, ఎమ్మల్యేలు, ఎమ్మెల్సీలు, జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్, మూడు జిల్లాల కలెక్టర్​లు పాల్గొననున్నారు. గత నెల 24వ తేదీన జీహెచ్​ఎంసీలో మొదటి విడతలో 11,700 మంది లబ్దిదారులను ఇదే పద్ధతిలో ఎంపిక చేసి.. ఈ నెల 2వ తేదీన 8 ప్రాంతాలలో ఇళ్లను అందించారు. ఇవాళ నిర్వహించే ఆన్​లైన్ డ్రాలో ఎంపికైన లబ్దిదారులకు 21న పురపాలక శాఖ మంత్రి కేటీఆర్(Municipal Administration Minister KTR) ఇళ్లను అందించనున్నారు.

Telangana Double Bedroom Application Status Check Online : ఆన్​లైన్​లో 'డబుల్ బెడ్ రూం' అప్లికేషన్ స్టేటస్.. ఎలా చెక్ చేసుకోవాలో తెలుసా?

2బీహెచ్​కే​ల కోసం 7 లక్షల మంది దరఖాస్తు : జీహెచ్ఎంసీ పరిధిలో మొత్తం డబుల్ బెడ్ రూమ్​ల కోసం 7 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. అందులో 95 వేలు మాత్రమే అర్హులుగా నిర్ధారించినట్లు తెలిపారు. వీటికి సంబంధించిన వెరిఫికేషన్​ను రెవెన్యూ శాఖ(Revenue Department) చేపట్టింది. లబ్దిదారులను కేటాయింపు చేసిన లొకేషన్ తీసుకొని రావడానికి హైదరాబాద్ జిల్లా కలెక్టర్, ఎమ్​ఆర్​వోలు, నోడల్ ఆఫీసర్లు కో-ఆర్డినేట్ చేస్తారని తెలిపారు. రిజర్వేషన్ల వారీగా ఈ ఆన్​లైన్ డ్రా నిర్వహిస్తున్నారు. దీనికోసం హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ ప్రత్యేక శ్రద్ధతో తయారుచేయించిన సాఫ్ట్​వేర్​తో పారదర్శకంగా డ్రా తీయనున్నారు. మరిన్ని విడతల్లో డబుల్ బెడ్​ రూమ్ ఇళ్ల పంపిణీ ఎంపిక ప్రక్రియ కొనసాగించనున్నట్లు ప్రభుత్వ వర్గాలు ప్రకటించాయి.

Double Bedroom Houses Distribution in Hyderabad : జాతరగా ఇళ్ల పంపిణీ.. కల నెరవేరిన వేళ లబ్ధిదారుల ఆనందం 'డబుల్'

KTR Review on Double Bedroom Houses Distribution : ఈనెల 21న 13,300 డబుల్​ బెడ్​రూం ఇళ్ల పంపిణీ.. సమీక్షలో కేటీఆర్ వెల్లడి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.