కొత్తపేటకు చెందిన శ్రీరిన్ క్రిస్టఫర్ అనే మహిళ కుల ధ్రువీకరణ పత్రం కోసం సరూర్నగర్ ఎమ్మార్వో కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నారు. 55 రోజులు గడిచినా సర్టిఫికేట్ రాలేదు. తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి ప్రశ్నించగా ఆపరేటర్ మురళిధర్, సీనియర్ అసిస్టెంట్ ఫణిధర్ అసభ్యపదజాలంతో దూషించారని ఆమె ఆరోపించారు. తాను దరఖాస్తు చేసిన ఒరిజినల్ సర్టిఫికేట్స్ చెత్తకుప్పలో పారవేశారని అన్నారు. అధికారులపై చర్యలు తీసుకోవాలని సదరు బాధితురాలు కలెక్టర్ లోకేష్ కుమార్కు ఫిర్యాదు చేశారు. ఇవీ చూడండి: దిల్ రాజు కార్యాలయంలో ఐటీ సోదాలు
ధ్రువపత్రం కోసం 55 రోజుల నిరీక్షణ... అయినా రాలే - srin kristafa
ప్రభుత్వ కార్యాలయాల్లో ధ్రువపత్రాలు పొందాలంటే చెప్పులు అరిగేలా తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఓ మహిళ కులం సర్టిఫికేట్ కోసం 55 రోజులుగా పోరాటం చేస్తోంది. ఇప్పటికీ ధ్రువ పత్రం రాలేదు. అదేంటని ప్రశ్నిస్తే సరూర్నగర్ రెవెన్యూ సిబ్బంది అసభ్య పదజాలంతో దూషిస్తున్నారని ఆమె వాపోయారు. ఈ విషయమై కలెక్టర్ ఫిర్యాదు చేశారు బాధితురాలు.