ఈనెల 15న కాంగ్రెస్ జాబితా విడుదల చేసేందుకు సన్నాహకాలు చేస్తున్నట్లు సమాచారం. హస్తం అభ్యర్థులు తెలిశాకే తెరాస తమ అభ్యర్థులను ప్రకటిచాలనుకుంటున్నట్లు తెలిసింది. కాంగ్రెస్ జాబితాను పరిగణలోకి తీసుకొని కేసీఆర్ 16న తుది జాబితా వెల్లడించాలని భావిస్తున్నట్లు సమాచారం.
శాసనసభ ఎన్నికల సమయంలోనూ సీఎం మొదటి జాబితాను ముందుగానే విడుదల చేశారు. రెండో జాబితా కాంగ్రెస్ జాబితా ప్రకటించాకే వెల్లడించారు. ఈ సారీ అదే వ్యూహంతో ముందుకెళ్లాలనే ఆలోచనలో ఉన్నారు కేసీఆర్. దాదాపు ఆరు స్థానాలకు అభ్యర్థులు ఖరారవగా వాటితో బుధవారం ఒక విడత పేర్లను వెల్లడించాలని భావించినా తాజా వ్యూహంలో భాగంగా విడుదల చేయలేదని తెలుస్తోంది.
కాంగ్రెస్ 15న జాబితా ప్రకటించకపోతే సీఎం ప్రకటించకపోతే ఆరుగురు గులాబీ అభ్యర్థులను ముందుగా కేసీఆర్ వెల్లడిస్తారు. హస్తం జాబితా వచ్చాక మిగతా 10 మంది పేర్లను వెల్లడించబోతున్నారని తెలిసింది. ఈనెల15,16న కేసీఆర్ ఎంపీలకు, ఎంపీ అభ్యర్థులకు విందు ఇవ్వనున్నారు. వారితో విడివిడిగా సమావేశం కానున్నారు. ప్రస్తుత పరిస్థితులు, సర్వే వివరాలు, ఎమ్మెల్యేల అభిప్రాయాలు వివరించనున్నారు. టికెట్లు దక్కని వారితో మాట్లాడి అసంతృప్తికి గురి కాకుండా వారికి కల్పించనున్న అవకాశాలను తెలియజేస్తారని సమాచారం.