సకల శాస్త్రాలను అభ్యసించిన పురోహితుడి దగ్గరకు వెళితే తన సమస్యకు పరిష్కారం దొరుకుతుందని భావించిన ఆమెకు మరో కొత్త సమస్య ఎదురైంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలానికి చెందిన మహిళ జాతకరీత్యా తనకున్న దోషాలతో సతమతమవుతున్నట్లు భావించింది. అయితే తన సమస్యలకు పరిష్కారం చూపుతాడని కొత్తగూడెంలోని విద్యానగర్‌కు చెందిన శరత్ అనే పూజారిని ఆశ్రయించింది. అయితే అతను తన కోరిక నెరవేర్చాలని.. బాధితురాలికి ఏ సమస్య రాకుండా చూసుకుంటాని వేధించాడు. రోజు ఫోన్లు చేస్తూ వేధించేవాడని మహిళ ఆరోపించింది. ఇక చేసేది లేక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది.
"ఇంటి దగ్గర దిగబెట్టేదాకా బాగానే ఉన్నాడు. బైక్ దిగాక చేయి పట్టుకున్నాడు. తన కోరిక తీర్చాలన్నాడు. లేకుంటే నా సంగతి చూస్తా అన్నాడు. తెల్లారి పన్నెండింటిదాకా ఇక్కడే ఉంటా అన్నాడు. ఏమైనా సరే ఇక్కడినుంచి కదలను అని చెప్పాడు. అదే భయంతో రోజంతా ఉన్నాను. శుక్రవారం వాళ్లింటికి.. మా బంధువులతో వెళ్లాను. వెళ్లగానే కోపంతో నాపై అరిచాడు. నన్ను లోపల పెట్టి గడియ వేశాడు. నాతో వచ్చిన వాళ్లను బయటకు నెట్టాడు. తనకు చాలామంది తెలుసని.. తననేం చేయలేరన్నాడు."
-బాధితురాలు
అయితే ఆ పూజారి శరత్ మాత్రం ఆ అమ్మాయని తన కుమార్తెలా భావించానని చెప్పుకొచ్చాడు. ఒక తండ్రిలా ఏ సమస్య రాకుండా చూసుకుంటా అని చెప్పానని వివరించాడు. ఆ మహిళే అనవసరంగా తాను అలాంటి అమ్మాయిని కాదని పదేపదే చెప్పిందని శరత్ తెలిపాడు.
ఆ అమ్మాయితో నేను ఏం అన్నానంటే.. అమ్మా.. నువు చనిపోవద్దు. రేపు పొద్దున ఏదోటి చేద్దాం. కానీ చస్తా గిస్తా అంటే నేను వెనక్కి వస్తా అన్నాను. నువు నా కూతురు లాంటిదానివమ్మా అని నేను మాట్లాడితే.. తాను అలాంటిదాన్ని కాదని ఆమె అంటుంది.
-శరత్, పురోహితుడు
ఇదీ చదవండి: కరోనా వ్యాక్సిన్ కోసం మళ్లీ ప్లాస్మా దానం