భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాద్రిగిరిపై కొలువైన సీతారామచంద్ర స్వామి ఆలయంలో మంగళవారం నుంచి విలాస ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. వేడుకల్లో భాగంగా స్వామివారు వేంకటేశ్వరుని అవతారంలో దర్శనమిచ్చారు. తహసీల్దార్ శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు.
ఆలయం నిర్మించినప్పుడు భక్త రామదాసు ఈ ఉత్సవాలు నిర్వహించగా.... అనంతరం భద్రాచలం తహసీల్దార్ స్థానంలో ఉన్నవారు పాల్గొనటం ఆనవాయితీగా వస్తోంది. ఈ నెల 10న స్వామివారికి విశ్వరూప సేవ చేయనున్నారు.
ఇదీ చూడండి: యునెస్కో గుర్తింపునకు అడుగు దూరంలో రామప్ప ఆలయం..