భద్రాద్రిలో ఉత్తర ద్వార దర్శనంలో భక్తులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొవిడ్ ఆంక్షలున్నా రాములవారి దర్శనానికి తరలివచ్చారు. మిథిలా ప్రాంగణం ఖాళీగా ఉన్నా తమని అనుమతించకపోవడంపై భక్తులు అసంతృప్తి వ్యక్తంచేశారు.
కేవలం వీఐపీలు, వారి కుటుంబాలు, పోలీసుల కుటుంబాలకు మాత్రమే అనుమతి ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. భద్రాద్రి ఆలయ అధికారులు, పోలీసుల తీరు సరికాదని భావించారు.
భద్రాద్రి దేవస్థానం ఉద్యోగులపై ఎమ్మెల్యే పొదెం వీరయ్య మండిపడ్డారు. స్వామివారి దర్శనానికి వెళ్తే అధికారులు పట్టించుకోలేదని ఆగ్రహం చెందారు. ప్రొటోకాల్ కూడా పాటించలేదని ఎమ్మెల్యే నిరసన వ్యక్తం చేశారు.
- ఇదీ చూడండి : తెలుగు రాష్ట్రాల్లో వైభవంగా ముక్కోటి ఏకాదశి వేడుకలు