వినోదంతో పాటు నచ్చిన క్రీడలో శిక్షణనిస్తూ వేసవి సెలవులను సద్వినియోగం చేసుకునేలా సింగరేణి సంస్థ వేసవి శిబిరం ఏర్పాటు చేసింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గం మణుగూరులో కొన్ని రోజుల కిందట ఈ క్రీడా శిక్షణ శిబిరం ప్రారంభించారు. అనతి కాలంలోనే విద్యార్థుల నుంచి అనూహ్య స్పందన వచ్చింది.
నచ్చిన ఆటలో పట్టు సాధిస్తూ..
సెలవుల్ని సద్వినియోగం చేసుకుంటూ... తమకిష్టమైన ఆటలో పట్టు సాధించేందుకు పిల్లలు మైదానం బాట పట్టారు. నిత్యం సుమారు 150 మందికి పైగా చిన్నారులు శిక్షకుల ఆధ్వర్యంలో పలు క్రీడల్లో మెలకువలు నేర్చుకుంటున్నారు. స్థానికులతో పాటు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారు కూడా శిబిరంలో పాల్గొంటున్నారు. విద్యార్థుల్లో స్ఫూర్తి నింపేందుకు ఏకరూప దుస్తులు పంపిణి చేశారు. ఆటపాటలతో అలసిన చిన్నారులకు అల్పాహారం అందిస్తున్నారు.
ఫుట్‌బాల్, వాలీబాల్, బాస్కెట్‌బాల్‌తో పాటు కరాటే, అథ్లెటిక్స్‌లో శిక్షణనిస్తున్నారు. ఈ వేసవి శిబిరం నిర్వాహకులను తల్లిదండ్రులు అభినందిస్తున్నారు.
ఇదీ చదవండి: ఓరుగల్లును హడలెత్తిన్న భానుడు