భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలం గాండ్ల గూడెంకు చెందిన ఓ మహిళ భర్త మూడేళ్ల క్రితం మృతి చెందాడు. రెండేళ్ల క్రితం పశ్చిమ గోదావరి జిల్లా తాడువాయికి చెందిన భూపతి రాజు అనే వ్యక్తితో సహాజీవనం సాగిస్తోంది. ఆమెకు ఇద్దరు బాలికలు. పెద్ద కుమార్తె స్థానిక గిరిజన ఆశ్రమ పాఠశాలలో 4వ తరగతి చదువుతోంది. గతేడాది దసరా సెలవులకి తల్లి వద్దకు వచ్చి అక్కడే ఉంటోంది. ఈ క్రమంలో తల్లితో సహజీవనం చేసే వ్యక్తి.. బాలికను చిత్రహింసలకు గురి చేశాడు. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్థులు పోలీసుల దృష్టికి తీసుకువెళ్లారు.
ఇదీ చూడండి: కర్ణాటకీయం: కుమార 'పరీక్ష'కు ఎమ్మెల్యేల గైర్హాజరు?