ETV Bharat / state

67 రోజుల్లో భద్రాద్రి రామయ్య ఆదాయం ఎంతంటే? - భద్రాచలం వార్తలు

భద్రాచలంలోని రామయ్య హుండీ ఆదాయం నగదు రూపంలో రూ.1,46,72,380 వచ్చినట్లు ఈవో శివాజీ తెలిపారు. 67 రోజుల్లో ఆదాయం కోటిన్నర రావడంతో ఆలయ సిబ్బంది ఆనందం వ్యక్తం చేశారు. దేవాదాయ శాఖ అధికారులు, పోలీసు శాఖ ఆధ్వర్యంలో సీసీ కెమెరాల పర్యవేక్షణలో హుండీలు లెక్కించారు.

sri-sitarama-chandra-swamy-hundi-income
రామయ్య హుండీ ఆదాయం
author img

By

Published : Dec 28, 2021, 11:55 AM IST

భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి వారి ఆలయ హుండీ ఆదాయాన్ని చిత్రకూట మండపంలో సోమవారం లెక్కించారు. ఈవో శివాజీ ఏర్పాట్లను పర్యవేక్షించగా సిబ్బందితోపాటు భక్తులు కానుకలు లెక్కించారు. నగదు రూపంలో రూ.1,46,72,380 రాగా 200 గ్రాముల బంగారం, 1.7 కిలోల వెండి సమకూరింది. అమెరికా డాలర్లు 435, ఇంగ్లాండ్‌ పౌండ్లు 20, సింగపూర్‌ డాలర్లు 35, యూఏఈ దీరామ్స్‌ 30, సౌదీ రియాల్స్‌ 166, యూరప్‌ యూరోలు 15, ఖతార్‌ రియాల్స్‌ 2, కువైట్‌ దీనార్లు 11, దక్షిణాఫ్రికా ర్యాండ్లు 50 వచ్చినట్లు ప్రకటించారు. గతంలో అక్టోబరు 21న లెక్కించగా ఇది 67 రోజుల ఆదాయంగా వెల్లడించారు.

నేడు సుదర్శన హోమం

భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి ఆలయంలో ధనుర్మాసోత్సవాలను పురస్కరించుకుని సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముత్తంగి అలంకారంలో ఉన్న అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుణ్ని దర్శించిన భక్తులు ప్రణమిల్లారు. ముత్యాలతో పొదిగిన వస్త్రాలంకృతుడైన దేవదేవుడు కనులకు విందు చేశాడు. సీతమ్మకు రామయ్య మాంగళ్యధారణ పరమానందమైంది. తలంబ్రాల సన్నివేశం మదిమదిని పులకింపజేయగా దర్బారు సేవ ఆధ్యాత్మికతను చాటింది. నేడు చిత్తా నక్షత్రం సందర్భంగా యాగశాలలో సుదర్శన హోమం నిర్వహించనున్నారు.

ఇదీ చూడండి: Rythu Bandhu Funds : రైతులకు శుభవార్త... నేటి నుంచి ఖాతాల్లోకి పెట్టుబడి సాయం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.