ETV Bharat / state

భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామికి ప్రత్యేక పూజలు

author img

By

Published : Aug 5, 2020, 12:20 PM IST

భద్రాచలంలోని శ్రీసీతారామచంద్ర స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అయోధ్యలో శ్రీ రామ మందిరం నిర్మాణ భూమి పూజ సందర్భంగా ఘనంగా పూజలు చేశారు. వేదపండితుల వేద మంత్రోచ్ఛరణాల మధ్య సంక్షేమ రామాయణ తంతువు, శ్రీ రామతారక కోపనిత్తు పారాయణం చేశారు.

భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామికి ప్రత్యేక పూజలు
భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామికి ప్రత్యేక పూజలు

అయోధ్యలో శ్రీ రామ మందిరం నిర్మాణం భూమి పూజ సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని శ్రీసీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. శంకు స్థాపన సంకల్ప బలం, పునాది బలంగా ఉండాలని ఆలయ అర్చకులు, వేద పండితులు ప్రత్యేక వేద మంత్ర పట్టణాలు, హోమాలు స్వామివారికి బంగారు పుష్పాలతో అర్చన చేశారు.

ఈ ఆలయంలోని బేడా మండపంలో ఈ ఉత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ప్రధాన ఆలయం నుంచి లక్ష్మణ సమేత సీతారాములను బేడా మండపం వద్దకు తీసుకు వచ్చారు. అనంతరం అర్చకులు స్వామివారికి సంక్షేమ రామాయణ తంతువు, శ్రీ రామతారక కోపనిషత్తు పారాయణం, సువర్ణ పుష్పార్చణ చేశారు.

ఇదీ చదవండి: రాష్ట్ర కేబినెట్ భేటీ.. చర్చించే అంశాలివే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.