సింగరేణి సంస్థలో ఉద్యోగం పొందడం జీవితానికి గొప్ప మలుపని... ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు. జీఓ నంబర్ 34 అమలు కోసం ఎన్నో పోరాటాలు, ధర్నాలు జరిగాయని, దాని ఫలితంగానే నిర్వాసితులకు ఉద్యోగాలు లభించాయని ఆయన గుర్తు చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు ఉపరితల గని ఏర్పాటుతో భూములు కోల్పోయిన నిర్వాసితుల్లో అర్హలైన 46 మంది గిరిజనులకు... సింగరేణిలో ఉద్యోగ నియామక పత్రాలను ఆయన అందజేశారు.

ఉద్యోగాలు పొందిన యువతీ, యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ముందుకు వెళ్లాలన్నారు. మిగిలిన వారికి కూడా త్వరలోనే ఉద్యోగ నియామక పత్రాలు అందజేస్తామని... సింగరేణి ఆపరేషన్స్ డైరెక్టర్ చంద్రశేఖర్ స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: మాఘశుద్ధ పంచమి అంటే ఏమిటి? ప్రత్యేకతలేంటి?