Bhadrachalam temple: భద్రాద్రి రామయ్యకు ఏటా కల్యాణ వేడుకలో సమర్పించే కోటి తలంబ్రాల పంట సిద్ధమైంది. ఏపీలోని తూర్పు గోదావరి జిల్లా అచ్యుతాపురానికి చెందిన శ్రీకృష్ణ చైతన్య సంఘం అధ్యక్షుడు అప్పారావు.... 12 ఏళ్లుగా గోటితో ఒలిచిన కోటి తలంబ్రాలను స్వామివారికి సమర్పిస్తున్నారు. విత్తనాలు చల్లిన నాటి నుంచి నారు పోసి.. నీరు పెట్టి.. కోత కోసే వరకు ప్రతి కార్యక్రమాన్ని ఆధ్యాత్మికంగా నిర్వహిస్తున్నారు.
ఈ ఏడాది పండించిన వరి పంటకు పూజలు నిర్వహించి రామనామం జపిస్తూ కోతలు కోశారు. శ్రీరామునితో పాటు ఆంజనేయుడు, సుగ్రీవుడు, అంగదుడు, జాంబవంతుడు వేషధారణలతో శ్రీరామకీర్తనలు ఆలపిస్తూ పంటను కోసి నూర్చి గింజలను సేకరించారు. వరి కోసే సమయంలో వారు చేసిన ఆధ్యాత్మిక కార్యక్రమం చుట్టుపక్కల వారిని ఆకట్టుకుంది.
![Koti talambralu](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/13813530_mn.jpg)
ఇదీ చదవండి: yadadri drone visuals: యాదాద్రి సుందర దృశ్యాలు.. చూపరులను కట్టిపడేసేలా నిర్మాణాలు