తెలంగాణ- ఆంధ్ర ప్రదేశ్ సరిహద్దు డివిజన్లలో నేరాల నియంత్రణకు ఇరు రాష్ట్రాల పోలీస్ అధికారులు సమావేశమయ్యారు. ఈ కార్యక్రమంలో పాల్వంచ డీఎస్పీ కేఆర్కే ప్రసాద్ రావు, పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం డీఎస్పీ లలిత కుమారి పాల్గొన్నారు.
రెండు రాష్ట్రాలకు అశ్వారావుపేట, పోలవరం డివిజన్లు సరిహద్దుగా ఉన్నందున ఒకరికొకరు సహకరించుకోవడం ఎంతో అవసరమని అధికారులు పేర్కొన్నారు. అశ్వారావుపేట పోలీస్ స్టేషన్లో జరిగిన ఈ భేటీలో నేరాల నియంత్రణ విషయమై చర్చించారు. ఈ సమావేశంలో అశ్వారావుపేట సీఐ ఉపేందర్ రావు, పాల్వంచ సీఐ మూర్తి తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: గిన్నిస్ రికార్డ్: 45 నిమిషాల్లోనే పెళ్లికూతురికి మేకప్