ETV Bharat / state

శిథిలావస్థకు చేరిన పెద్దవాగు ప్రాజెక్టు - Repairs

విస్తారంగా కురిసిన వర్షాలకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పెద్దవాగు ప్రాజెక్టులో వరద నీరు భారీగా చేరడం వల్ల గేట్లను ఎత్తి నీటిని వదిలారు. ఈ క్రమంలో ఎత్తిన మూడు గేట్లలో మెుదటి గేటును దించే సందర్భంలో మెురాయించడం వల్ల నీరు వృథాగా పోతోంది. శిథిలావస్థకు చేరిన ఈ ప్రాజెక్టును అధికారులు మరమ్మతులు చేయించడం లేదని స్థానిక రైతులు ఆరోపిస్తున్నారు.

శిథిలావస్థకు చేరిన పెద్దవాగు ప్రాజెక్టు
author img

By

Published : Sep 20, 2019, 10:43 AM IST

రెండు రోజులుగా విస్తారంగా కురిసిన వర్షాలకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలం గుమ్మడివెల్లి సమీపంలో ఉన్న పెద్దవాగు ప్రాజెక్టు గేట్లను ఎత్తి నీటిని గోదావరిలోకి వదిలారు. ఉన్న మూడు గేట్లలో మెుదటి గేటు దించే క్రమంలో మెురాయించింది. దీని వల్ల నీరు వృథాగా పోతోంది. శిథిలావస్థకు చేరిన ఈ ప్రాజెక్టు గేట్లు మరమ్మతులు చేయడంలో అధికారులు జాప్యం చేస్తున్నారని స్థానిక రైతులు ఆరోపించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తగిన చర్యలు చేపట్టాలని కోరారు. ఈ ప్రాజెక్టు మీదనే తమ జీవితాలు ఆధారపడి ఉన్నాయని వారు వాపోతున్నారు.

శిథిలావస్థకు చేరిన పెద్దవాగు ప్రాజెక్టు
ఇదీచూడండి:ఐదోరోజూ అన్వేషణ... అయినా దొరకని జాడ

Intro:TG_KMM_03_19_LEEKULA_PRAJECT_AV_TS10088 పాలకుల చిన్నచూపు అధికారుల నిర్లక్ష్యం వెరసి రైతుల పాలిట వర ప్రదాయినిగా పేరున్న పెద్ద వాగు ప్రాజెక్ట్ శాపంగా మారింది ఏళ్ల తరబడి మరమ్మతులు చేయకపోవడంతో ప్రాజెక్ట్ గేట్లు తుమ్ములు శిథిలావస్థకు చేరి పంటపొలాలకు జీవం పోయాల్సిన నీళ్లు గేట్ల లీకులు వల్ల గోదారి పాలు అవుతున్నాయి వివరాల్లోకి వెళితే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలంలోని గుమ్మడవెల్లి సమీపంలో ఉన్న పెద్ద వాగు ప్రాజెక్ట్ కింద పదహారు వేల ఎకరాల ఆయకట్టు ఉంది 1102 ఎకరాల శిఖం భూమి లో ఆరు మీటర్ల ఎత్తులో 0.6 టీఎంసీల నీటి సామర్థ్యం కలిగే విధంగా ఈ ప్రాజెక్టును 1974లో నిర్మించారు గత ఏడాది కురిసిన భారీ వర్షాల కారణంగా దీనికున్న ఒకటో గేటు బెండు వచ్చింది దీంతో మిగతా రెండు గేట్లు ద్వారానే ప్రాజెక్టులోకి చేరిన అధిక నీరు కిందికి వదులుతారు అయితే ఈ ఆడది ఇది విస్తారంగా కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టులో చేరిన నీటిని మూడవ గేట్లు ఎత్తి దిగువకు వదులుతున్నారు కాగా రెండు రోజుల క్రితం కురిసిన భారీ వర్షం కారణంగా ప్రాజెక్టులోకి నీరు భారీగా చేరింది దీంతో నీటి పారుదల శాఖ అధికారులు మూడవ గేటును పూర్తిగా ఎత్తటం కాకుండా సమస్య ఉన్నా ఒకటో గేటును కూడా ఎత్తారు ప్రాజెక్టులో కి వచ్చే వరద తగ్గటంతో అధికారులు గేట్లు దించే ప్రయత్నం చేశారు సమస్య ఉన్న ఒకటో గేటు దిగేందుకు మొరాయించింది దీంతో నీళ్లు ప్రాజెక్ట్ నుంచి వృథాగా పోతున్నాయి అధికారుల నిర్లక్ష్యం వల్లనే ప్రాజెక్టు గేట్లు ధ్వంసం అవుతున్నట్లు ఆయకట్టు రైతులు ఆరోపిస్తున్నారు సమస్య ఉందని తెలిసికూడా ఒకటో నెంబర్ గేట్ను ఎందుకు వారు అధికారులు ప్రశ్నిస్తున్నారు వరిగడ్డి ఇసుక బస్తాలతో లీకుల ను నివారించాలని చూసినప్పటికీ అధికారులకు సాధ్యం కాలేదు నిండుకుండను తలపించే తట్లు ఉన్న ప్రాజెక్టు ఈ లింకులు వల్ల కాళీ అవుతుందని ఆయకట్టు రైతులు ఆందోళన చెందుతున్నారు ప్రాజెక్టు నీళ్లనే నమ్ముకొని బాగు చేసిన తన పంటలకు నీళ్లు అందమేమో నని వారు భయపడుతున్నారు ఈ అంశమై నీటిపారుదల శాఖ డి ఈ ఈటీవీ భారత్ వివరణ కోరేందుకు ప్రయత్నించగా మాట్లాడేందుకు ఆయన నిరాకరించారు

Body:లీకుల ప్రాజెక్ట్

Conclusion:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపే ట
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.