ETV Bharat / state

కరోనాతో వృద్ధురాలు మృతి... కడసారి చూపు కోసం కూడా రాలేదు - భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వార్తలు

కరోనా... మనుషుల్లో బంధాలను, బంధుత్వాలను కూడా తెంచేస్తోంది. భద్రాచలంలోని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో మణుగూరుకు చెందిన ఓ వృద్ధురాలు కరోనా చికిత్స పొందుతూ మృతి చెందగా... ఆమె మృతదేహాన్ని చూసేందుకు ఒక్కరు కూడా రాలేదు. కుటుంబ సభ్యులు ఎవరూ రాకపోవడంతో అనాథ శవంలా అంత్యక్రియలు జరిగాయి.

old woman died due to corona in bhadradri kothagudem district
కరోనాతో వృద్ధురాలు మృతి... కడసారి చూపు కోసం కూడా రాలేదు
author img

By

Published : Aug 2, 2020, 12:18 AM IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో మణుగూరుకు చెందిన ఓ వృద్ధురాలు శనివారం కరోనాతో మృతి చెందింది. మణుగూరులోని గట్టు మల్లారం కాలనీకి చెందిన వృద్ధురాలికి కరోనా పాజిటివ్ రావడం వల్ల భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం పొందుతూ ఈ రోజు మృతి చెందింది. ఆమెకు కరోనా లక్షణాలు ఉండడం వల్ల జులై 27న భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రిలో పరీక్షలు చేయించారు వృద్ధురాలికి కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో కుటుంబ సభ్యులు ఆమెను భద్రాచలం ప్రభుత్వ ఆస్పత్రిలోనే ఐసోలేషన్ వార్డులో చేర్పించి వెళ్లిపోయారు. ఈరోజు ఆమె మృతి చెందడంతో ఆసుపత్రి సూపరింటెండెంట్ యుగంధర్ వృద్ధురాలి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.

వారెవరు మృతదేహాన్ని తీసుకువెళ్లమని చెప్పారు. కనీసం కడసారి చూడడానికి కూడా కుటుంబ సభ్యులు ఎవరు రాలేదు. దీంతో భద్రాచలం ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ యుగంధర్ తహసీల్దార్ నాగేశ్వరరావు, డాక్టర్ చైతన్య ఆధ్వర్యంలో పంచాయతీ సిబ్బందితో కలిసి భద్రాచలంలో అంత్యక్రియలు నిర్వహించారు. కరోనా రావడం వల్ల కుటుంబ సభ్యులు బంధువులు ఎవరు హాజరు కాకపోవడం వల్ల చివరికి అనాథ శవంలా అంత్యక్రియలు జరిగాయి.

ఇవీ చూడండి: చిట్టితల్లికి కొండంత వేదన... చేయూత కోసం తల్లిదండ్రుల అభ్యర్థన

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.