భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు జడ్పీటీసీ వాంకుడోత్ ఉమాదేవి నివాసానికి వెళ్లి మహబూబాబాద్ పార్లమెంటు సభ్యురాలు కవిత, ఇల్లందు శాసనసభ్యురాలు హరిప్రియ పరామర్శించారు. ఇల్లందులో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహించే ఆమె భర్త ఇటీవల అనారోగ్యంతో మరణించారు.
ఈ విషయంపైనే ఉమాదేవిని పరామర్శించేందుకు ఆమె ఇంటికి వెళ్లారు. వీళ్లతోపాటు గ్రంథాలయ ఛైర్మన్ దిండిగాల రాజేందర్, మున్సిపల్ ఛైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వర్లు, వైస్ ఛైర్మన్ జానీ, తెరాస నాయకురాలు ఖమ్మం పాటి రేణుక పాల్గొన్నారు.
ఇవీ చూడండి: రాష్ట్రంలో కరోనా కలవరం... 858కి చేరిన కేసులు