ETV Bharat / state

మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ప్రారంభించిన ఎమ్మెల్యే హరిప్రియ - ఖమ్మం వార్తలు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండలం చల్లా సముద్రం వద్ద ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే హరిప్రియ ప్రారంభించారు. అధికారులు సూచించిన విధంగా రైతులు నాణ్యత ప్రమాణాలు పాటించి పంటను విక్రయించుకోవాలని రైతులకు ఎమ్మెల్యే సూచించారు.

మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ప్రారంభించిన ఎమ్మెల్యే హరిప్రియ

author img

By

Published : Nov 12, 2020, 5:03 PM IST

రైతు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేస్తామని ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకుందని ఎమ్మెల్యే హరిప్రియ అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండలం చల్లాసముద్రం వద్ద ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు.

మొక్కజొన్న పంటను సాగుచేయొద్దని ప్రభుత్వం సూచించినప్పటికీ రైతులు సాగు చేశారని... అయినప్పుటికీ ప్రభుత్వం కొనుగోలు చేస్తోందని ఎమ్మెల్యే అన్నారు. దళారులను నమ్మి మోసపోవద్దని కొనుగోలు కేంద్రాల్లోనే పంటను విక్రయించాలని సూచించారు. ప్రతి గ్రామాన్ని పరిశీలించి సమస్యల పరిష్కారానికి కృషిచేస్తామన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్​ దిండిగాల రాజేందర్, సర్పంచ్ తాటి చుక్కమ్మ, పీఏసీఎస్​ ఛైర్మన్​ మెట్టల కృష్ణ, రైతు సమన్వయ సమితి నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

అనంతరం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండలం సుభాష్ నగర్​లోని పల్లె ప్రకృతి వనంలో ఎమ్మెల్యే హరిప్రియ మొక్కలు నాటారు. పల్లె ప్రకృతి వనం పరిశీలించి ప్రజాప్రతినిధులకు అధికారులకు పలు సూచనలు చేశారు.

ఇదీ చూడండి: మంత్రులు, తెరాస ప్రధాన కార్యదర్శులతో కేసీఆర్‌ భేటీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.