మావోయిస్టులు ఏడు రోజుల క్రితం కిడ్నాప్ చేసిన ఇంజినీర్ అజయ్ రోషన్ లక్రాను(Engineer ajay roshan lakra) విడిచిపెట్టారు. ఛత్తీస్‌గఢ్‌లోని(chhattisgarh state) బీజాపూర్ జిల్లాలో ఆయనను అపహరించిన మావోయిస్టులు ఇవాళ ప్రజాకోర్టులో మీడియా ముందు విడుదల చేశారు. ఆ సమయంలో ఇంజినీర్ భార్య అర్పితా లక్రా కూడా అక్కడే ఉన్నారు.
గత ఏడు రోజులుగా మీడియా, పెద్దలు ఇంజినీర్‌ను విడుదల చేయాలంటూ మావోయిస్టులకు విజ్ఞప్తి చేశారు. ఇంజినీర్ ఆచూకీ కోసం భార్యతో సహా మీడియా సిబ్బంది 7 రోజుల పాటు అడవుల్లో గాలించారు.
ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన(PMGSY) పథకం కింద బీజాపూర్‌లోని(bijapur district) మనకేలీ గోరనా ప్రాంతంలో రోడ్డు నిర్మాణ పనుల పరిశీలనకు వెళ్లిన ఇంజినీర్ అజయ్ రోషన్ లక్రా(36)(Engineer ajay roshan lakra) , అటెండర్ లక్ష్మణ్ పర్తగిరి(26)ను మావోయిస్టులు కిడ్నాప్ చేశారు.
రెండు రోజులకే అటెండర్ విడుదల..
ఇద్దరు ఉద్యోగులను అపహరించిన మావోయిస్టులు.. అందులో అటెండర్ లక్ష్మణ్ పర్తగిరిని రెండు రోజుల అనంతరం విడిచిపెట్టారు. ఇంజనీర్ లక్రా వారి చెరలోనే ఉండగా తాజాగా ఇవాళ ప్రజాకోర్టులో విడులదయ్యారు.
ఇదీ చూడండి: