ప్రతినిధులు కలిసి సమన్వయంతో పనిచేస్తేనే ప్రజాసమస్యలు పరిష్కారం అవుతాయని ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వరరావు పేర్కొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేటలో నియోజకవర్గంలోని అన్ని శాఖల అధికారులతో సమావేశమయ్యారు. శాఖల వారీగా పనితీరుపై సమీక్షించారు. ఒకవైపు నియోజకవర్గంలోని మండలాల ఎంపీపీలు, జడ్పీటీసీలు, సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు పాల్గొన్నారు. రెవెన్యూ శాఖలో ఎక్కువగా పట్టాదారు పాసు పుస్తకాలు రావడంలేదని ప్రజా ప్రతినిధులు ఎంపీ దృష్టికి తీసుకు వెళ్లారు. సమీక్ష సమావేశంలో తన దృష్టికి వచ్చిన అన్ని సమస్యల పరిష్కారానికి తాను కృషి చేస్తానని ఎంపీ నామ నాగేశ్వరరావు హామీ ఇచ్చారు.
ఇదీ చూడండి: 'రాష్ట్రంలో తెరాస, భాజపావి తెరచాటు రాజకీయాలు'