భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు సింగరేణి ప్రధాన ఆసుపత్రిలో ఏర్పాటు చేయనున్న ఐసోలేషన్ హోమ్ క్వారంటైన్ కేంద్రాన్ని ఏరియా జనరల్ మేనేజర్ సత్యనారాయణ పరిశీలించారు. సింగరేణి ఉద్యోగులకు కరోనా వైరస్ చికిత్స అందించేందుకు ముందస్తుగా 20 పడకలతో ఐసోలేషన్ వార్డు ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు.
ఒకవేళ ఎవరైనా కరోనా బారిన పడితే అన్ని సదుపాయాలతో ఏర్పాటు చేస్తున్న ఈ ఐసోలేషన్ హోం క్వారంటైన్ కేంద్రంలోనే ఉద్యోగులు చికిత్స పొందాలని సూచించారు.
ఎవరూ కరోనా గురించి భయపడాల్సిన అవసరం లేదని... కాకపోతే మాస్కులు ధరిస్తూ భౌతిక దూరం పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అధికారులు శ్రీనివాస్, లక్ష్మీనారాయణ, నరసింహారావు, డాక్టర్ సరిత పాల్గొన్నారు.
ఇవీ చూడండి: రాష్ట్రంలో కొత్తగా 1430 కరోనా కేసులు.. ఏడుగురు మృతి