భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పురపాలక ఎన్నికల్లో తెరాసకు ప్రజలు అఖండ మెజారిటీ కట్టబెట్టి తనను ఛైర్మన్గా ఎన్నుకున్నందుకు దమ్మాలపాటి వెంకటేశ్వర్లు పట్టణ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికల సమయంలో పట్టణ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు కృషి చేస్తామని ఆయన పేర్కొన్నారు.
పట్టణంలో బస్ డిపో ఏర్పాటు.. మోడల్ మార్కెట్టును అభివృద్ధి చేస్తానని చెప్పారు. తెరాస పార్టీ గెలిస్తే మంత్రి కేటీఆర్ ఇచ్చిన హామీ మేరకు పట్టణ దత్తత అంశాన్ని మంత్రి దృష్టికి తీసుకువెళ్లి పట్టణ అభివృద్ధికి తన వంతు కృషిచేస్తానని తెలిపారు.
ఇవీ చూడండి: నిర్భయ దోషి క్షమాభిక్ష పిటిషన్పై నేడు సుప్రీం విచారణ