భద్రాద్రి రామయ్య సన్నిధిలో వసంత పక్ష తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ వేడుకల్లో భాగంగా నేడు ధ్వజారోహణం ఘనంగా నిర్వహించారు. ముందుగా హోమశాలలో ఉన్న గరుడ పటాన్ని ప్రధాన ఆలయంలోని లక్ష్మణ సమేత సీతారాముల ధ్వజస్తంభం దగ్గరకు తీసుకొచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దూప, దీప, నైవేద్యాలు సమర్పిస్తూ వేద పఠనం చేశారు.
ఈ ధ్వజారోహణ గరుడ ప్రసాదాన్ని స్వీకరిస్తే సంతానం కలుగుతుందని పురాణాలు తెలుపుతున్నాయని పండితులు తెలిపారు. గరుడ ప్రసాదాన్ని పంపిణీ చేశారు. అనంతరం గరుడ పటాన్ని ధ్వజస్తంభంపై ఎగరవేశారు. ఇవాళ ఉదయం అగ్ని మథనం, అగ్ని ప్రతిష్ఠ కార్యక్రమాలను నిర్వహించారు. ఈ ఉత్సవాల్లో ఆలయ వైదిక పెద్దలతో పాటు ఈవో శివాజీ, ఆలయ సిబ్బంది, భక్తులు తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: భద్రాద్రిలో వైభవంగా తిరు కల్యాణ బ్రహ్మోత్సవాలు