ETV Bharat / state

ఇల్లందులో మొక్కలు నాటేందుకు గుంతలు తీసే యంత్రం ప్రారంభం

author img

By

Published : Jul 2, 2020, 3:53 PM IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో మొక్కలు నాటేందుకు గుంతలు తీసే యంత్రాన్ని ప్రారంభించారు. ఈ యంత్రాన్ని వినియోగించుకుని మున్సిపాలిటీ పరిధిలో విరివిగా మొక్కలు నాటాలని మున్సిపాలిటీ ఛైర్మన్​ డీవీ అధికారులకు సూచించారు.

drilling  Machine started in illandu for pliantation

హరితహారం కార్యక్రమంలో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో మొక్కలు నాటేందుకు గుంతలు తీసే యంత్రాన్ని పురపాలక ఛైర్మన్​ డీవీ, కమిషనర్​ శ్రీనివాస్​ రెడ్డి ప్రారంభించారు. మున్సిపాలిటీ పరిధిలోని 24 వార్డులలో విరివిగా మొక్కలు నాటటమే లక్ష్యంగా పెట్టుకున్న సిబ్బందికి గుంతలు తీయటం సమస్యగా మారింది. ఈ సమస్యను అధిగమించేందుకు డ్రిల్లింగ్​ యంత్రాన్ని అందుబాటులోకి తెచ్చినట్లు ఛైర్మన్​ తెలిపారు. ఈ యంత్రాన్ని వినియోగించుకుని ఎక్కువ సంఖ్యలో మొక్కలు నాటి... మున్సిపాలిటీని హరితవనంగా తీర్చిదిద్దాలని సూచించారు.

ఇవీ చూడండి: రవిప్రకాశ్‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ కేసు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.