భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయం లోపలికి చిన్న పిల్లలను, వృద్ధులను అనుమతించకపోవడంపై భక్తులు ఆందోళన చెందుతున్నారు. కేంద్రం.. కొవిడ్ నిబంధనలను సడలించిన తర్వాత కూడా దర్శనానికి వారిని అనుమతించడం లేదని అసహనం వ్యక్తం చేస్తున్నారు.
కరోనా నేపథ్యంలో ఆలయాల లోపలికి 10 సంవత్సరాలలోపు పిల్లలను 65 సంవత్సరాలు పైబడిన వృద్ధులను అనుమతించడం లేదు. కానీ ఆర్టీసీ బస్సుల్లో, ప్రైవేటు వాహనాల్లో, ఇతర ప్రాంతాల్లో అనుమతిస్తున్నారు.
స్వామి వారిని దర్శించుకునేందుకు తెలుగు రాష్ట్రాల్లో అనేక ప్రాంతాల నుంచి భక్తులు తరలి వస్తారు. కానీ కరోనా తీవ్రతని దృష్టిలో ఉంచుకొని వృద్ధులను, చిన్నపిల్లలను దర్శనానికి అనుమతించడం లేదు. వారిని బయట వదిలేసి వెళ్లాలంటే ఇబ్బందిగా ఉందని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కరోనా నిబంధనలను సడలించిన కేంద్ర ప్రభుత్వం.. ఆలయం లోపల స్వామివారి దర్శనానికి నిబంధనలు సడలించాలని కోరుతున్నారు.
ఇదీ చదవండి: యథేచ్ఛగా ఇసుక దందా.. అడ్డొచ్చిన వారిపై దాడులు