కరోనా వ్యాధిపై యుద్ధం చేస్తూనే.. ప్రజల అవసరాలను తీర్చేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ ఎంవీ రెడ్డి తెలిపారు. భద్రాచలంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో జిల్లాలోని అన్ని మండలాల తహసీల్దార్లతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కరోనా వ్యాధి నివారణకు తీసుకోవాల్సిన పలు జాగ్రత్తలపై అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
కరోనా వ్యాధిని ఎదుర్కొనేందుకు కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పదని ఆయన సూచించారు. మనం వ్యాధి పట్ల జాలి దయ చూపిస్తే వైరస్ ఎవరిపై కనికరం చూపదని ఆయన పేర్కొన్నారు. విదేశాల నుంచి వచ్చే వారి నుంచే జిల్లాలో కరోనా తీవ్రత పెరిగిందని.. ఇతర దేశాల నుంచి వచ్చిన వారిని ఇరవై ఎనిమిది రోజులపాటు క్వారంటైన్లో ఉంచాలని సూచించారు. ప్రజలెవరూ రోడ్ల మీదకు రాకుండా ఇంటి వద్దనే ఉండాలని కోరారు. అనంతరం భద్రాద్రి రామయ్యను దర్శించుకుని.. ఏప్రిల్ 2న జరిగే సీతారాముల కల్యాణ వేడుకల ఏర్పాట్లను పరిశీలించారు.
ఇదీ చూడండి: కరోనాను జయించేందుకు ఇవి తెలుసుకోండి...