తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వర్రావు పేర్కొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేటలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్‌తో కలిసి ఆయన ఎంపీడీవో కార్యాలయ భవనం, రైతు వేదికని ప్రారంభించారు.
గాంధీ బాటలో..
పల్లెలు బాగుంటేనే దేశం బాగుంటుందనే గాంధీ సిద్ధాంతాన్ని సీఎం కేసీఆర్ పాటిస్తూ.. తెలంగాణ పల్లెలను అభివృద్ధి పథంలో తీసుకెళ్తున్నట్లు నామా తెలిపారు. అశ్వారావుపేట, దమ్మపేట మండలాల్లో ఏర్పాటు చేసిన ఫామ్ ఆయిల్ పరిశ్రమలు రైతుల అభివృద్ధికి దోహదపడుతాయని వివరించారు. ఈ కార్యక్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిషత్ ఛైర్మన్ కోరం కనకయ్య, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, జిల్లా కలెక్టర్, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: తెలంగాణ ఉద్యమ నేత బూర్గుల కన్నుమూత