జనవరి 3 నుంచి 23వ తేదీ వరకు భద్రాద్రిలో జరగనున్న శ్రీ వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు జరగనున్నాయి. ఈ ఉత్సవాలలో భాగంగా రామయ్య రోజుకొక అవతారంలో భక్తులకు దర్శనమిస్తారు. ఉత్సవాలకు సంబంధించిన పోస్టర్ను దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ఆవిష్కరించారు. వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలకు రావాల్సిందిగా దేవాదాయ శాఖ అధికారులు, వేదపండితులు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి ఆహ్వాన పత్రికను అందజేశారు.
మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి వేద పండితులు ఆశీర్వచనం అందించగా.. ఆలయ అధికారులు స్వామివారి ప్రసాదాన్ని ఇచ్చారు. అనంతరం మంత్రి వైకుంఠ ఏకాదశి ఆధ్యయనోత్సవ ఏర్పాట్ల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. జనవరి 12న తెప్పోత్సవం, 13న ఉత్తర ద్వార దర్శనాన్ని తిలకించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉందని, తదనుగుణంగా ఏర్పాట్లు చేయాలని మంత్రి ఆదేశించారు. కొవిడ్ ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను అమలు చేయాలని సూచించారు. భక్తులు కూడా కరోనా నిబంధనలను పాటించేలా చర్యలు తీసుకోవాలన్నారు.
ఇదీ చూడండి: Flyover Inauguration: ఒవైసీ, మిధాని కూడళ్లలో ఫ్లై ఓవర్ ప్రారంభించిన మంత్రి కేటీఆర్