భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం రామయ్య సన్నిధిలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ తాయారు అమ్మవారు ఉప దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నేడు గజలక్ష్మీ అలంకారంలో భక్తులకు దర్శనం ఇస్తున్నారు. ఈ రోజు వేకువజాము నుంచే మహిళలు ఆలయానికి చేరుకొని పంచామృతాలతో అభిషేకాలు చేస్తున్నారు. ఈ రోజు మధ్యాహ్నం మహానివేదన... అనంతరం సహస్ర కుంకుమ పూజ నిర్వహించనున్నారు. మహిళలచే శ్రీ లక్ష్మి అష్టోత్తర శతనామావళి పారాయణం చేయనున్నారు. సాయంత్రం ఐదు గంటలకు మహా మంత్రపుష్పం ప్రత్యేక పూజ జరపనున్నారు. గజలక్ష్మీ రూపంలో దర్శనమిస్తున్న అమ్మవారిని దర్శించుకోవడం వల్ల అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని వేద పండితులు చెబుతున్నారు.
ఇవీ చూడండి: అలా వరదలో కొట్టుకుపోయాడు... ఇలా బయటకొచ్చాడు