ETV Bharat / state

'తవ్వడం ఆపండి.. లేదంటే మమ్మల్ని అందులోవేసి పూడ్చండి' - కందకాలు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలంలో పోడుదారులకు, అటవీ అధికారులకు మధ్య స్వల్ప వాగ్వాదం చోటు చేసుకుంది. పోడు భూములను నమ్మకొని జీవిస్తున్న తమకు అన్యాయం చేస్తున్నారని అధికారులపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.

altercation took place between foresters and forest officials in the Zulurpadu zone of badradri Kottagudem district
'పనులు ఆపకపోతే.. తమను అందులోనే పూడ్చండి'
author img

By

Published : Jan 5, 2021, 10:23 AM IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం పాపకొల్లులో పోడుదారులు ఆందోళనకు దిగారు. సమీప అటవీ ప్రాంతంలో సంబంధిత అధికారులు చేపట్టిన కందకాల తవ్వకాలను అడ్డుకున్నారు. పనులను ఆపకపోతే.. తమను కందకాల్లో పూడ్చండంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

అటవీ భూముల్లో పలు నిర్మాణాలు చేపడుతూ.. భూమిని నమ్మకుని జీవిస్తున్న తమకు అన్యాయం చేస్తున్నారని అధికారులపై పోడుదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో వారివురి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పోడుదారులకు నచ్చజెప్పినా వారు వినకపోవడంతో అధికారులను పనులను తాత్కలికంగా నిలిపివేశారు.

ఇదీ చదవండి:'అటవీ భూములు ఆక్రమిస్తే చర్యలు తప్పవు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.