ETV Bharat / state

పత్తి రైతుల పాట్లు.. నాణ్యత పేరిట అధికారుల కొర్రీలు

ఆరుగాలం కష్టించి పండించిన పత్తి పంటను అమ్ముకునేందుకు రైతులు నానా అవస్థలు పడుతున్నారు. సీసీఐ నిబంధనల పేరిట అధికారులు పత్తి రైతులకు ఇబ్బందులకు గురిచేస్తున్నారు. మొదట తేమ పేరిట కొర్రిలు పెట్టిన అధికారులు అనంతరం పరిగ పేరిట అవస్థల పాలు చేస్తున్నారు. దళారులకు లాభం చేకూర్చే విధంగా అధికారులు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి.

cotton farmer
పత్తి రైతుల పాట్లు.. నాణ్యత పేరిట అధికారుల కొర్రీలు
author img

By

Published : Dec 4, 2019, 4:47 PM IST

పత్తి రైతుల పాట్లు.. నాణ్యత పేరిట అధికారుల కొర్రీలు

పత్తి పంట సాగుకు.. ఖండాంతర ఖ్యాతిగడించిన ఆదిలాబాద్ జిల్లాలో నూతనంగా తీసుకొచ్చిన నిబంధనలు రైతులను కలవరపాటుకు గురిచేస్తున్నాయి. పత్తి పంటకు చివరిదశలో వచ్చే (ఫిబ్రవరి, మార్చిలో)వ్యాధి 'పరిగ' (కౌడి) పేరిట.. అధికారులు కొనుగోళ్లను నిరాకరిస్తున్నారు.

తొలుత తేమ.. ఇప్పుడు పరిగ..

ఆదిలాబాద్‌ వ్యవసాయ మార్కెట్‌ యార్డులో నవంబర్ 6న కొనుగోలు ప్రక్రియ ప్రారంభమైంది. మొదట తేమ శాతం అధికంగా ఉందంటూ సీసీఐ కొనుగోళ్లకు ముందుకు రాకపోవడం.. వ్యాపారులకు కలిసివచ్చింది. క్వింటా పత్తికి రూ.5,550 మద్దతు ధరగా ప్రభుత్వం నిర్ణయించింది. అయితే తేమ పేరిట వ్యాపారులు మాత్రం క్వింటాకు సగటున రూ.4 వేలు మాత్రమే చెల్లించారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పత్తిలో తేమ శాతం తగ్గుముఖం పట్టిన తర్వాత సీసీఐ మరలా కొనుగోలు ప్రారంభించింది. ఇదంతా వ్యాపారుల లబ్ధి కోసమే చేశారని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

నాణ్యత కోసమే..

ఆదిలాబాద్​ మార్కెట్​ యార్డుకు ఇప్పటివరకు నాలుగు లక్షల క్వింటాళ్ల పత్తి విక్రయానికి వచ్చింది. ఈ మొత్తంలో 2.90 లక్షల కింటాళ్ల తెల్ల బంగారాన్ని సీసీఐ కొనుగోలు చేసింది. అంతా సాఫీగా సాగుతున్న తరుణంలో కొంత మంది అధికారులు పరిగ (కౌడి)పేరిట అడ్డంకులు సృష్టించడంపై రైతుల నుంచి అభ్యంతరం వ్యక్తమవుతోంది. నాణ్యమైన పత్తి సేకరణ కోసం ఇలా చేయక తప్పడం లేదని అధికారులు చెబుతున్నారు.

అటు అధికారుల నిబంధనలు, వ్యాపారుల డిమాండ్ల మధ్య రైతన్నలు నలిగిపోతున్నారు. కష్టించి పండించిన పంటను అమ్ముకునేందుకూ ఇబ్బందులు తప్పడం లేదని వాపోతున్నారు.

ఇవీచూడండి: జాతీయ రోయింగ్​ ఛాంపియన్​షిప్​ పోటీలను ప్రారంభించిన మంత్రి

sample description

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.