ప్రజా సమస్యల పరిష్కారం కోసం భాజపా అనునిత్యం కృషి చేస్తుందని ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు పేర్కొన్నారు. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండల కేంద్రంలో సోమవారం ఆయన పర్యటించారు. మాజీ ఎంపీ సీతారాం నాయక్ తనపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరైన విధానం కాదని.. తన గురించి మాట్లాడే స్థాయి సీతారాంకు లేదని మండిపడ్డారు.
ఏజెన్సీ ప్రాంతంలోని గిరిజనేతరుల సమస్యల కోసం తాను పార్లమెంటులో ప్రస్తావించానని ఎంపీ పేర్కొన్నారు. గతంలో ఎంపీలుగా బాధ్యతలు స్వీకరించిన వారు ఎవరు కూడా గిరిజనేతరుల సమస్యల గురించి ప్రస్తావించలేదని అన్నారు.
ఇవీచూడండి: విదేశీ ఫలాలు... ఆరోగ్యానికి సోపానాలు