ETV Bharat / state

రిమ్స్ ఆస్పత్రిలో పాము కలకలం.. భయంలో రోగులు - adilabad rims hospital

ఆదిలాబాద్‌ రిమ్స్‌ ఆస్పత్రిలో పాము కలకలం రేపింది. ఆస్పత్రిలోని ప్రసూతి వార్డులో పాము కనిపించటంతో.... రోగులు భయభ్రాంతులకు గురయ్యారు. విషయం తెలుసుకున్న సిబ్బంది.... రోగులను మరో వార్డులోకి తరలించారు.

snake , snake in rims hospital, adilabad rims hospital
ఆస్పత్రిలో పాము, ఆదిలాబాద్ రిమ్స్, రిమ్స్ ఆస్పత్రి
author img

By

Published : Mar 29, 2021, 1:25 PM IST

ఆదిలాబాద్‌ రిమ్స్‌ ఆసుపత్రిలో పాము కలకలం రేపింది. ప్రసూతి వార్డులోకి వచ్చిన పాము.. మంచం కింద నుంచి స్నానాలగదిలోకి వెళ్లింది. విషయం తెలుసుకున్న ఆసుపత్రి వర్గాలు ఆ వార్డును ఖాళీ చేయించి రోగులను మరో వార్డులోకి తరలించారు.

ఆసుపత్రి వర్గాల నిర్లక్ష్యం తమ ప్రాణాల మీదకు తెస్తుందని రోగులు మండిపడుతున్నారు. ప్రసూతి వార్డులోని రోగులను ఖాళీ చేసి చేతులు దులుపుకున్న సిబ్బంది ఆ పాము జాడ మాత్రం కనుగొనలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు.. ఆ వార్డు నుంచి స్నానాలగదిలోకి వెళ్లిన పాము తర్వాత కనిపించలేదని సిబ్బంది తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.