
చక్రాల కుర్చీలో చెల్లెలితో.. ఆదిలాబాద్ టు చత్తీస్‌గఢ్ నడక - lock down effect
రాహుల్, ఇడ్తే, అశ్వినిలు హైదరాబాద్‌లో భవన నిర్మాణ కార్మికులుగా పనిచేస్తున్నారు. అశ్విని ఓ భవనంలో పనిచేస్తుండగా కిందపడి కాలు విరగడంతో ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. నూతన చక్రాల కుర్చీని కొనుగోలు చేసి తమ చెల్లెని అందులో కూర్చొబెట్టుకొని ఛత్తీస్‌గఢ్‌కు అన్నదమ్ములిద్దరూ తోసుకుంటూ తీసుకెళుతున్నారు. ఆదిలాబాద్ జిల్లా పిప్పర్‌వాడ జాతీయ రహదారిపై చక్రాల కుర్చీలో తీసుకెళుతున్న ఆ చిత్రం చూపరుల మనసు కదిలించింది.

అన్నాచెల్లెళ్ల అనుబంధం

