గిరిజనుల సమస్యలను పరిష్కరించడానికి శాయశక్తులా కృషిచేస్తామని ఉట్నూర్ ఐటీడీఏ పీవో భవిష్ మిశ్రా హామీ ఇచ్చారు. అదిలాబాద్ జిల్లా ఉట్నూరులోని కొమురం భీం ప్రాంగణంలో నిర్వహించిన ప్రపంచ ఆదివాసి దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. సంప్రదాయ వాయిద్యాల నడుమ ఆదివాసి జెండా ఆవిష్కరించి కుమురం భీం చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా గూడలోని ఆదివాసులు ఎదుర్కొంటున్న సమస్యలను భవిష్ మిశ్రాకు విన్నవించారు. మారుమూల గిరిజన విద్యార్థులకు విద్యాభివృద్ధి కోసం కృషి చేయాలని పేర్కొన్నారు. సమస్యల పరిష్కారానికి కృషిచేస్తామని ఐటీడీఏ పీవో హామీ ఇచ్చారు.
కరోనా నేపథ్యంలో గూడలోని విద్యార్థులు చదువులో రాణించడానికి ఆన్లైన్ పాఠాలు వినేందుకు తల్లిదండ్రులు సహకరించాలని సూచించారు. ఈ కార్యక్రమానికి డీఎస్పీ ఉదయ్ రెడ్డి, ఎంపీపీ జయవంత్ రావు, ఆదివాసీ సంఘాల నాయకులు, తదితరులు హాజరయ్యారు.
ఇదీ చూడండి : ఆ విషయంలో సీఎంను ప్రశ్నించిన ఎంపీ రేవంత్ రెడ్డి