ETV Bharat / state

Dialysis patient: ఆమెకు భవిష్యత్​పై ఆశలు.. దాతల కోసం ఎదురుచూపులు - డయాలసిస్‌

Dialysis patient: భార్యభర్తలు.. ఒకరికొకరు తోడూ నీడ.. సమాజంలో పేద, ధనిక తేడా ఉండొచ్చేమో కానీ.. ఆప్యాయతానురాగాల మధ్య బేధం ఉండదు. అలా రెక్కల కష్టాన్ని నమ్ముకొని సంసారజీవితాన్ని ఆనందంగా ప్రారంభించిన నవదంపుతుల్లో ఒక్కసారి పెనువిషాదం ఆవరించింది. కళ్లముందే భార్య ఆరోగ్యం క్షీణిస్తుంటే.. నిస్సహాయ స్థితిలో భర్త కన్నీరుపెట్టాల్సి వస్తోంది. మానవతావాదులు స్పందిస్తే తప్ప.. బతకడం కష్టంగా మారిన ఓ నవవధువు జీవితగాథపై ఈటీవీ భారత్ ప్రత్యేక మానవీయ కథనం.

Dialysis patient:
భార్యభర్తలు
author img

By

Published : May 13, 2022, 5:08 AM IST

Updated : May 13, 2022, 5:35 AM IST

Dialysis patient: సొంతిళ్లులేని ధైన్యం. రెక్కాడితేకానీ డొక్కనిండని పేదరికం. అయినా కుంగిపోని మనస్థత్వం. ఉన్నదాంట్లోనే ఆనందంగా గడిపిన దాంపత్యం. కానీ ఇప్పుడు పరిస్థితి తలకిందులైంది. క్షణం ఒక యుగంలా కాలం వెల్లదీయాల్సి వస్తోంది. వెరసి... ఏడాదిన్నరలోనే తారుమారైన ఆదిలాబాద్‌ జిల్లా జైనథ్‌కు చెందిన నవదంపుతులైన సంకినేని దీపాలి-నితిన్‌ బతుకుచిత్రమిది.

మూడేళ్ల క్రితం పెళ్లైన దీపాలి- నితిన్‌ది నిరుపేద కుటుంబం. బతుకుదెరువులో భాగంగా మహారాష్ట్ర నుంచి ఆదిలాబాద్‌ జిల్లా జైనథ్‌కు వలసవచ్చిన వీరికి ఆస్తిపాస్తులేమీలేవు. సొంతిల్లూలేదు. జైనథ్‌లో ఖాళీగా పడి ఉన్న రెండుపడక గదుల ఇంటిలోనే తాత్కాలిక నివాసమైనప్పటికీ బెంగపడలేదు. ఏడాదిన్నర క్రితం దీపాలి గర్భం దాల్చగా... ఆనందంగా వైద్యం కోసం వెళ్లగా హైబీపీ ఉన్నట్లు తేలింది. వైద్యపరీక్షలు చేయిస్తే మూత్రపిండాల సమస్య ఉన్నట్లు నిర్ధారణ కావడంతో దీపాలి-నితిన్‌లో ఆందోళన మొదలైంది. హైదరాబాద్‌లోని ఆసుపత్రిలో పరీక్షలు చేయించగా రెండు మూత్రపిండాలు పాడైపోయినట్లు తేలడంతో బతుకును చీకటి ఆవరించినట్లైంది. ఈలోగా గర్భస్రావం జరిగింది. దీపాలి బతకాలంటే మూత్రపిండం మార్పిడి తప్పనిసరని, 9 లక్షలు ఖర్చవుతాయనీ, అప్పటివరకు వారంలో మూడుసార్లు డయాలసిస్‌ చేయాల్సిందేనని వైద్యులు సూచించడంతో ఏం చేయాలో తెలియక అల్లాడుతోంది.

ఆమెకు భవిష్యత్​పై ఆశలు.. దాతల కోసం ఎదురుచూపులు

కళ్లముందే బిడ్డ కాటికిపోయే పరిస్థితి కనిపించడంతో తల్లడిల్లిన ఆమె తల్లి మంగళ... మూత్రపిండం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ 9లక్షల ఖర్చు భరించడమే పరీక్షగా మారింది. ఆరోగ్యశ్రీ, రేషన్‌కార్డు సైతం లేదు. దీపాలి ఆరోగ్యం క్రమక్రమంగా క్షీణిస్తోంది. శ్వాస తీసుకోడం ఇబ్బందిగా ఉంది. రిమ్స్‌లో వారానికి మూడుసార్లు డయాలసిస్ జరుగుతోంది. నితిన్‌ కూలికి వెళ్తే గానీ పొట్టగడవదు. అటు పేదరికం, ఇటు క్షీణిస్తున్న ఆరోగ్యంతో కుటుంబ పరిస్థితి దయనీయంగా మారింది. తనకు బతకాలని ఉందని భార్య ప్రాధేయపడుతుంటే... కన్నీరుపెట్టుకోవడం మినహా చేసేదేమీలేని నిస్సహాయ స్థితిలో నితిన్‌ కాలం వెల్లదీయాల్సి వస్తోంది.

ఇవీ చూడండి: రానున్న రోజుల్లో మెడికల్​ హబ్​గా తెలంగాణ..: సబితాఇంద్రారెడ్డి

కుప్పకూలిన ప్రభుత్వ హెలికాప్టర్.. ఇద్దరు పైలట్లు మృతి

Last Updated : May 13, 2022, 5:35 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.