ETV Bharat / state

మళ్లీ విజృంభిస్తోన్న డెంగీ భూతం - మళ్లీ విజృంభిస్తోన్న డెంగీ భూతం

ఆదిలాబాద్‌ జిల్లాలో డెంగీ వ్యాధి మళ్లీ విజృంభిస్తోంది. వ్యాధిగ్రస్థుల్లో భయాన్ని రేకెత్తిస్తోంది. ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయ లోపం ప్రజల పాలిట శాపంగా మారుతోంది. వెలుగులు పంచే దీపావళి పండుగను కూడా చేసుకోలేక.. ఆసుపత్రి మంచానికే పరిమితమయ్యామనే ఆవేదన వ్యాధిగ్రస్థులను కంటతడి పెట్టించేలా చేస్తోంది.

మళ్లీ విజృంభిస్తోన్న డెంగీ భూతం
author img

By

Published : Oct 30, 2019, 9:00 AM IST

మళ్లీ విజృంభిస్తోన్న డెంగీ భూతం

తలనొప్పి తగ్గడంలేదనే బాధ ఒకరిది... రక్తకణాలు పెరగడం లేదనే భయం మరొకరిది... కనీసం దీపావళి పండుగ కూడా చేసుకోలేకపోయామనే ఆవేదన ఇంకొకరిది... ఇలా ఒక్కొక్కరి బాధ... ఒక్కోతీరు... ఆదిలాబాద్‌ జిల్లాను డెంగీ వ్యాధి మళ్లీ భయపెడుతోంది. జిల్లా వ్యాప్తంగా తాజాగా కురుస్తోన్న వర్షాలతో... వ్యాధుల తీవ్రత మళ్లీ పెరిగింది. ప్రధానంగా డెంగీ, టైఫాయిడ్ జ్వరాలతో జనం ఆసుపత్రులకు పరుగుపెట్టాల్సి వస్తోంది.

ఒక్కో మంచానికి ఇద్దరి చొప్పున వైద్యం

ఆదిలాబాద్‌ మున్సిపల్‌ పరిధిలోని పుత్లీబౌలీ, శాంతినగర్‌, లక్ష్మీనగర్‌, ఖుర్షీద్‌నగర్‌, హమాలీవాడ కాలనీల్లో డెంగీ, టైఫాయిడ్‌ జ్వరాల తీవ్రత ఎక్కువగా ఉంది. అధికారిక లెక్కల ప్రకారమే... 159 డెంగీ కేసులు నమోదయ్యాయంటే.. వ్యాధి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. మరోపక్క ఆదిలాబాద్‌ గ్రామీణ మండలం పరిధిలోకి వచ్చే అంకోలి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో 78 డెంగీ వ్యాధి కేసులు నమోదు కావడం భయాందోళనకు గురిచేస్తోంది. రోజురోజుకు పెరుగుతున్న వ్యాధిగ్రస్థుల తాకిడి కారణంగా ఆదిలాబాద్‌లోని రిమ్స్‌ వైద్య కళాశాలలో ఒక్కో మంచంలో ఇద్దరి చొప్పున వైద్యం అందించాల్సి వస్తోంది.

బాధితుల వేదన వర్ణణాతీతం

రిమ్స్‌ వైద్యకళాశాలలో చికిత్స పొందుతున్న బాధితుల వేదన వర్ణణాతీతంగా ఉంది. దీపావళి పండుగను కూడా చేసుకోలేకపోయామనే ఆవేదన కొంత మంది బాధితులను కంటతడిపెట్టిస్తే... ప్రధానంగా రక్తపరీక్షలు చేసే వైద్య సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా సకాలంలో వైద్యం అందడంలేదనే ఆవేదన మరికొందరిని కలవరానికి గురిచేస్తోంది. డెంగీ, టైఫాయిడ్‌ వ్యాధుల తీవ్రత క్రమంగా పెరుగుతుండడం... వ్యాధిగ్రస్థులను భయపెట్టిస్తుంటే.... దానికి తగిన వైద్యం అందిస్తున్నామనే భరోసా వైద్యుల నుంచి వినిపిస్తోంది.
జిల్లాలో పెరుగుతున్న వ్యాధుల తీవ్రతపై కనీసం... ప్రజాప్రతినిధులైనా స్పందించకపోవడం ఆందోళనకు గురిచేస్తోంది. సంబంధిత శాఖల అధికారులతో కనీసం సమీక్షా సమావేశాలు ఏర్పాటు చేయకపోవడం... విమర్శలకు తావిస్తోంది.

ఇవీ చూడండి: 'పక్షవాతాన్ని ఎదుర్కునేందుకు... స్ట్రోక్​ కేర్​ ఆన్​ వీల్స్​'

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.