ఆదిలాబాద్ పట్టణంలోని పలు వార్డుల్లో జిల్లా కలెక్టర్ శ్రీదేవసేన పర్యటించారు. రోడ్లపై అనవసరంగా తిరుగుతున్న వారికి అవగాహన కల్పించారు. అత్యవసర సమయాల్లో బయటకు వస్తే తప్పకుండా మాస్కులు ఉపయోగించాలని సూచించారు. ప్రజలు ఇంటిపట్టునే ఉండాలని పిలుపునిచ్చారు.
ఆదిలాబాద్ పట్టణంలోని 19 కంటైన్మెంట్ వార్డులను గుర్తించినట్టు కలెక్టర్ శ్రీదేవసేన పేర్కొన్నారు. ఆయా వార్డుల ప్రజలు బయటకు రావొద్దని, ఇతర ప్రాంతాల ప్రజలు ఆయా వార్డుల వైపు వెళ్లకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు.
ఇవీ చూడండి: గుంజిళ్లు తీయించి.. కరోనా ప్రమాణం చేయించి..