అక్రమ మద్య రవాణా చేస్తున్న వ్యక్తి మృతి ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలం అర్లిటికి చెందిన షేక్ షబ్బీర్ పెన్‌గంగా నదిలో మునిగి చనిపోయాడు. మహారాష్ట్ర సరిహద్దులోని పెన్‌గంగా నది సమీపంలోని చినార్లి గ్రామం నుంచి షబ్బీర్ మరో నలుగురితో కలసి మద్యం అక్రమ రవాణా చేస్తున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు బుధవారం అర్ధరాత్రి తెలంగాణ సరిహద్దులో మాటు వేశారు. పోలీసులను చూసి భయంతో పరుగులు తీసి నదిలో పడిపోయాడు. గ్రామస్థులు గాలించగా.. గురువారం శవమై తేలాడు. మృతదేహం మహారాష్ట్ర సరిహద్దులో తేలడం వల్ల అక్కడి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇతని మృతికి అబ్కారీ పోలీసుల అత్యుత్సాహమే కారణమని కుటుంబీకులు ఆరోపిస్తుండగా.. అధికారులు షబ్బీర్‌ను వెంబడించలేదని చెబుతున్నారు.ఇవీ చదవండి:జంట పేలుళ్లకు ఆరేళ్లు