ETV Bharat / sports

Olympics Live: రెజ్లింగ్​ సెమీస్​లో దీపక్ పునియా ఓటమి

tokyo-olympics-live-updates
టోక్యో ఒలింపిక్స్​ 2020
author img

By

Published : Aug 4, 2021, 6:27 AM IST

Updated : Aug 4, 2021, 3:33 PM IST

15:32 August 04

పురుషుల రెజ్లింగ్‌‌ సెమీస్‌లో దీపక్‌ పునియా ఓడిపోయాడు. 86 కిలోల విభాగంలో పోటీపడిన అతడు.. ‌అమెరికా రెజ్లర్ మోరిస్‌ చేతిలో ఓటమిపాలయ్యాడు. కాంస్యం కోసం రష్యన్‌ రెజ్లర్‌ ఆర్టర్‌తో తలపడనున్నాడు.

15:00 August 04

భారత యువ రెజ్లర్ రవికుమార్ దహియా ఫైనల్​ల్లో అడుగుపెట్టాడు. 57 కిలోల విభాగంలో పోటీపడిన అతడు.. కజకిస్థాన్​కు రెజ్లర్ సనయెవ్​పై విజయం సాధించాడు. దీంతో కనీసం రజతం ఖాయం చేసుకున్నాడు. ఒకవేళ ఫైనల్​లో గెలిస్తే రవికుమార్ స్వర్ణం అందుకుంటాడు.

11:23 August 04

లవ్లీనా ఓటమి..

టోక్యో ఒలింపిక్స్‌లో భారత మహిళా బాక్సర్​ లవ్లీనా బొర్గోహెన్ 64-69 కేజీల విభాగంలో సెమీఫైనల్​లో పరాజయం పొందింది. టర్కీకి చెందిన సుర్మేనెలి బుసేనాజ్​తో జరిగిన సెమీస్​లో ఓటమిపాలైంది. ఫలితంగా లవ్లీనాకు కాంస్యం లభించింది.

09:47 August 04

సెమీస్​కు మరో రెజ్లర్​ దీపక్​ 

రెజ్లింగ్​ మెన్స్​ ఫ్రీస్టైల్​ 86 కేజీల విభాగంలో జరిగిన క్వార్టర్స్​లో చైనాకు చెందిన లిన్ జుషెన్​పై 6-3 తేడాతో గెలిచిన భారత రెజ్లర్ దీపక్​ పునియా.. సెమీఫైనల్​లో అడుగుపెట్టాడు. ​

09:43 August 04

సెమీస్​కు రెజ్లర్​ రవిదహియా..

రెజ్లింగ్​ మెన్స్​ ఫ్రీస్టైల్​ 57 కేజీల విభాగంలో జరిగిన క్వార్టర్స్​లో బల్గేరియాకు చెందిన జార్జి వాలెంటినోవ్​ను 14-4 తేడాతో ఓడించిన భారత రెజ్లర్​ రవి దహియా సెమీఫైనల్​లో అడుగుపెట్టాడు. 

09:09 August 04

క్వార్టర్స్​లోకి దీపక్​..

  • పురుషుల రెజ్లింగ్‌‌లో క్వార్టర్‌ ఫైనల్‌కు చేరిన దీపక్‌ పునియా
  • రెజ్లింగ్ పురుషుల 86 కిలోల విభాగం క్వాలిఫయర్స్‌లో దీపక్ గెలుపు
  • నైజీరియా రెజ్లర్‌ ఎకిరెకెమెపై 12-1తో దీపక్ పునియా గెలుపు

08:42 August 04

మహిళల రెజ్లింగ్​లో నిరాశ

రెజ్లింగ్‌ మహిళల 57 కిలోల విభాగంలో అన్షు మాలిక్‌ నిరాశపరిచింది. క్వార్టర్‌ ఫైనల్‌కు అర్హత సాధించలేకపోయింది. బెనారస్‌ రెజ్లర్‌ చేతిలో 8-2తో ఓటమి పాలైంది.

08:28 August 04

రవికుమార్‌ గెలుపు

రెజ్లింగ్‌ 57 కిలోల విభాగంలో క్వార్టర్ ఫైనల్‌ చేరాడు రవికుమార్‌. కొలంబియా రెజ్లర్‌ అర్బనోపై 13-2 తేడాతో గెలిచాడు. 

08:08 August 04

శివపాల్​ సింగ్​...

జావెలిన్​ త్రోలో శివపాల్​ సింగ్​ ఫైనల్​కు ఆర్హత సాధించలేకపోయాడు. భారత్​ తరఫున నీరజ్​ చోప్రా ఇప్పటికే ఫైనల్​లోకి ప్రవేశించాడు.

06:11 August 04

ఫైనల్​కు క్వాలిఫై అయిన నీరజ్ చోప్రా

పురుషుల జావెలిన్​ త్రో క్వాలిఫికేషన్​ గ్రూప్​ ఏలో నీరజ్​ చోప్రా అదరగొట్టాడు. మొదటి ప్రయత్నంలోనే ఫైనల్​కు ఎంపికయ్యాడు ఈ భారత స్టార్​ ఆటగాడు. ఈ ఒలింపిక్స్‌లో అతడు కచ్చితంగా పతకం గెలుస్తాడనే నమ్మకంతో ఉన్నారు క్రీడాభిమానులు.

Last Updated : Aug 4, 2021, 3:33 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.