ETV Bharat / sports

Wimbledon: జకోవిచ్, సబలెంక శుభారంభం - రెండో రౌండ్​కు సబలెంక

లండన్​ వేదికగా జరుగుతోన్న వింబుల్డన్ ఓపెన్(Wimbledon​) పురుషుల సింగిల్స్​లో సెర్బియా టెన్నిస్ స్టార్ జకోవిచ్​ తొలి రౌండ్​లో విజయం సాధించాడు. బ్రిటిష్ ఆటగాడు జాక్​ డ్రాపర్​పై 4-6, 6-1, 6-2, 6-2తో గెలుపొందాడు.

Djokovic, sabalenka
జకోవిచ్, సబలెంక
author img

By

Published : Jun 28, 2021, 9:56 PM IST

లండన్​ వేదికగా ప్రారంభమైన వింబుల్డన్​ ఓపెన్​లో(Wimbledon​) ప్రపంచ నంబర్​ వన్​ ప్లేయర్​ నొవాక్ జకోవిచ్​ శుభారంభం చేశాడు. వైల్డ్ కార్డ్​ ద్వారా టోర్నీలోకి ప్రవేశించిన బ్రిటిష్ ఆటగాడు జాక్ డ్రాపర్​పై తొలి రౌండ్​లో 4-6, 6-1, 6-2, 6-2తో విజయం సాధించాడు. గేమ్​ తొలి సెట్​ను 4-6 తేడాతో కోల్పోయిన ఈ సెర్బియా స్టార్​ తర్వాత మూడు సెట్లను గెలుపొందాడు.

జకోవిచ్​ తన తర్వాతి రౌండ్​లో ఐదో సీడ్ ఆటగాడు కెవిన్ అండర్సన్​తో తలపడనున్నాడు. చివరిసారిగా 2019లో వింబుల్డన్​ జరిగింది. కొవిడ్ కారణంగా గతేడాది ఈ టోర్నీ జరగలేదు. రెండేళ్ల తర్వాత ప్రతిష్ఠాత్మక ఓపెన్​ తిరిగి ప్రారంభం కావడం వల్ల అభిమానులు పెద్ద ఎత్తున స్టేడియానికి వచ్చారు.

రెండో రౌండ్​కు సెబలెంక..

బెలారస్​ టెన్నిస్ స్టార్ అరేనా సెబలెంక వింబుల్డన్​ ఓపెన్​ రెండో రౌండ్​లోకి ప్రవేశించింది. తొలి రౌండ్​లో రొమేనియా ప్లేయర్​ మోనికా నిక్లేస్కుపై 6-1, 6-4తో వరుస సెట్లలో విజయం సాధించింది. మ్యాచ్ ప్రారంభం నుంచి ప్రత్యర్థిపై ఆధిపత్యం ప్రదర్శించింది సెబలెంక.

ఇదీ చదవండి: Wimbledon: వింబుల్డన్​కు ఎంపికైన తొలి చైనా ఆటగాడు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.