టాప్‌సీడ్ ప్లేయర్, యూఎస్ ఓపెన్ టైటిల్ ఫేవరెట్ నొవాక్ జకోవిచ్.. టోర్నీ నుంచి అనుహ్య రీతిలో నిష్క్రమించాడు. ఆదివారం నాలుగో రౌండ్ ఆడుతున్న సందర్భంగా లైన్ అంపైర్‌ను అనుకోకుండా బంతితో కొట్టడం వల్ల అతడు వెనుదిరిగాల్సి వచ్చింది.
అసలేం జరిగింది?
నాలుగో రౌండ్.. పబ్లో కర్రెనోతో జకోవిచ్ మ్యాచ్.. మధ్యలో సర్వీస్ చేసిన అనంతరం చేతిలో ఉన్న బంతిని కోర్టు పక్కకు కొట్టాడు. అక్కడే ఉన్న లైన్ అంపైర్ గొంతుపై అది తాకింది. దీంతో ఆమె నొప్పితో విలవిలలాడుతూ అక్కడే కూర్చుండిపోయింది. ఆమె దగ్గరికి వెళ్లిన జకోవిచ్.. ఆ తర్వాత మిగిలిన అంపైర్లతో చాలాసేపు చర్చించాడు. ఆఖరికి ప్రత్యర్థితో కరచాలనం చేసి కోర్టు నుంచి వైదొలిగాడు. అనంతరం ట్విట్టర్ ద్వారా వివరణ ఇచ్చాడు జకో.
-
This whole situation has left me really sad and empty. I checked on the lines person and the tournament told me that thank God she is feeling ok. I‘m extremely sorry to have caused her such stress. So unintended. So… https://t.co/UL4hWEirWL
— Novak Djokovic (@DjokerNole) September 6, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">This whole situation has left me really sad and empty. I checked on the lines person and the tournament told me that thank God she is feeling ok. I‘m extremely sorry to have caused her such stress. So unintended. So… https://t.co/UL4hWEirWL
— Novak Djokovic (@DjokerNole) September 6, 2020This whole situation has left me really sad and empty. I checked on the lines person and the tournament told me that thank God she is feeling ok. I‘m extremely sorry to have caused her such stress. So unintended. So… https://t.co/UL4hWEirWL
— Novak Djokovic (@DjokerNole) September 6, 2020
"ఈ ఘటన నన్ను నిరాశకు గురిచేసింది. బంతి తగిలిన తర్వాత ఆమెతో మాట్లాడాను. బాగానే ఉన్నా అని చెప్పేసరికి చాలా ప్రశాంతంగా అనిపించింది. ఆమెకు క్షమాపణలు. అయితే అనర్హత సాధించాను కాబట్టి మళ్లీ ప్రాక్టీసు మొదలుపెడతాను. ఈ తప్పు నుంచి పాఠాలు నేర్చుకుంటాను. నా ప్రవర్తనతో ఇబ్బంది కలిగించినందుకు యూఎస్ ఓపెన్ యాజమాన్యానికి క్షమాపణలు చెబుతున్నాను" -నొవాక్ జకోవిచ్, స్టార్ టెన్నిస్ ప్లేయర్
అనంతరం ఈ విషయమై ప్రకటన విడుదల చేసింది యూనైటెడ్ స్టేట్స్ టెన్నిస్ అసోసియేషన్. గ్రాండ్‌స్లామ్ నిబంధనల ప్రకారం అతడు బంతి కొట్టడాన్ని అతిక్రమణగా పరిగణించి అనర్హత వేటు వేశాం. టోర్నీలో సంపాదించిన అన్ని ర్యాంకింగ్ పాయింట్లతో సహా ప్రైజ్మైనీ మొత్తాన్ని కోల్పోతాడు.