ETV Bharat / sports

కరోనా వల్ల యూఎస్​ ఓపెన్ టోర్నీ​ వాయిదా! - వింబుల్డన్​ ఓపెన్​

కరోనా ధాటికి మరో టోర్నీ వాయిదా పడనుంది. యూఎస్​ ఓపెన్​ను జరిపేందుకు ఉన్న అన్ని అవకాశాలను పరిశీలిస్తున్నట్టు అమెరికన్​ టెన్నిస్​ అసోసియేషన్​ చెప్పింది.

US Open tennis championship could be postponed by coronavirus
కరోనా ఎఫెక్ట్​: యూఎస్​ ఓపెన్​ వాయిదా!
author img

By

Published : Mar 18, 2020, 2:57 PM IST

కరోనా వైరస్‌ ముప్పుతో యూఎస్‌ ఓపెన్‌ టెన్నిస్‌ టోర్నీ వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతర్జాతీయ టెన్నిస్‌ సంఘం, ఏటీపీ, డబ్లూటీఏ నిర్వాహకులను సంప్రదించిన తర్వాతే కొత్త షెడ్యూల్​ను నిర్ణయిస్తామని అమెరికా టెన్నిస్‌ సంఘం వెల్లడించింది.

'ఏ నిర్ణయమైనా ఏకపక్షంగా తీసుకోవద్దని మేం గుర్తించాం' అని యూఎస్‌టీఏ తెలిపింది. ఇప్పటికే కొవిడ్‌-19 ప్రభావంతో ఫ్రెంచ్‌ ఓపెన్‌ టోర్నీ వాయిదా వేశారు. మే 24- జూన్‌ 7 మధ్య జరిగే ఫ్రెంచ్​ ఓపెన్​ను సెప్టెంబర్‌ 20 నుంచి అక్టోబర్‌ 4 మధ్య జరపాలని నిర్ణయించారు. యూఎస్‌ ఓపెన్‌ను ఆగస్టు 23- సెప్టెంబర్‌ 13 వరకు నిర్వహించాల్సి ఉంది. ఒకవేళ యూఎస్‌ ఓపెన్‌ వాయిదా పడకపోతే రెండు టోర్నీల మధ్య ఉండే అంతరం కేవలం వారం రోజులే అవుతుంది.

'యూఎస్‌టీఏ ఇప్పటికైతే యూఎస్‌ ఓపెన్‌ 2020 షెడ్యూల్​లో ఎలాంటి మార్పులు చేయలేదు. న్యూయార్క్‌లోని బిల్లీ జేన్‌కింగ్‌ టెన్నిస్‌ సెంటర్​లో ఆగస్టు 24 నుంచి సెప్టెంబర్‌ 13 వరకు జరుగుతుంది. ప్రస్తుత పరిస్థితులు సంక్లిష్టంగా ఉన్నాయి. మేం అన్ని అవకాశాలను పరిశీలిస్తున్నాం. టోర్నీని వాయిదా వేయడం అందులో ఒకటి' అని అమెరికా టెన్నిస్‌ సంఘం తెలిపింది. ఇక ప్రతిష్ఠాత్మక సైక్లింగ్‌ పోటీలు 'టూర్‌ డి ఫ్రాన్స్‌'ను వాయిదా వేస్తున్నామని నిర్వాహకులు ప్రకటించారు.

ఇదీ చూడండి.. ఐపీఎల్ నిర్వహణలో​ బీసీసీఐ ప్లాన్-బి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.