యూఎస్ ఓపెన్‌లో ఫేవరెట్‌గా బరిలోకి దిగిన సెరెనాకు సెమీఫైనల్లో చెక్ పెట్టింది బెలారస్ భామ అజరెంక. సెప్టెంబర్ 13న జరగనున్న మహిళల సింగిల్స్‌లో టైటిల్ కోసం ఒసాకాను 'ఢీ' కొట్టనుంది.
సెరెనాకు నిరాశ..
మార్గరేట్ కోర్ట్ (24) ఆల్‌టైమ్ అత్యధిక టైటిళ్ల రికార్డును సమం చేయాలని ఆశించిన అమెరికా తార సెరెనా విలియమ్స్‌కు.. మరోసారి తీవ్ర నిరాశ. ఈ అమ్మ కలను భగ్నం చేస్తూ మరో అమ్మ విక్టోరియా అజరెంక (బెలారస్) యుఎస్ ఓపెన్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఏడేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత అజరెంక.. ఈ టోర్నీ తుది సమరానికి అర్హత సాధించింది. టైటిల్ పోరులో జపాన్ స్టార్ నవోమి ఒసాకాతో అమీతుమీ తేల్చుకోనుంది. మరో సెమీస్‌లో బ్రాడీపై గెలిచి ఒసాకా ఫైనల్లో అడుగుపెట్టింది.
అదరగొట్టిన అజరెంక
విక్టోరియా అజరెంక అదరగొట్టింది. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో ఈ అన్‌సీడెడ్ 1-6, 6-3, 6-3తో ఆరుసార్లు ఛాంపియన్, మూడోసీడ్ సెరెనా విలియమ్స్‌ను ఓడించింది. అయితే ఈ సమరంలో ఆరంభం సెరెనాదే. శక్తివంతమైన సర్వీసులు, విన్నర్లతో విరుచుకుపడిన 39 ఏళ్ల విలియమ్స్ తొలి సెట్‌ను 6-1తో సులభంగా చేజిక్కించుకుంది. కానీ రెండో సెట్ నుంచి అజరెంక గొప్పగా పుంజుకోగా.. సెరెనా అనూహ్యంగా తడబడింది.
బేస్‌లైన్ నుంచి రెండు పదునైన బ్యాక్‌హ్యాండ్ విన్నర్లతో 3-2తో ఆధిక్యంలోకి వెళ్లిన అజరెంక.. సర్వీసులోనూ సత్తా చాటుతూ 6-3తో సెట్ గెలిచి మ్యాచ్‌లో నిలిచింది. నిర్ణయాత్మక మూడో సెట్లోనూ విక్టోరియాదే పైచేయి. ఎలాంటి ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా ఆడిన ఈ రెండుసార్లు (2012, 13) ఆస్ట్రేలియన్ ఓపెన్ విజేత.. బేస్‌లైన్ ఆటతో అదరగొట్టింది.
చీలమండ గాయం ఇబ్బంది పెట్టడం సెరెనాను దెబ్బతీసింది. మ్యాచ్ మధ్యలో చికిత్స తీసుకున్న ఆమె.. బ్యాండేజ్ వేసుకుని ఆటను కొనసాగించింది. ఆ తర్వాత సెరెనా పూర్తి స్థాయిలో ఆడలేకపోయింది. దూకుడు కొనసాగించిన 31 ఏళ్ల అజరెంక 6-3తో సెట్‌తో పాటు మ్యాచ్‌ను గెలుచుకుంది. 2013 (యూఎస్ ఓపెన్) తర్వాత అజరెంక గ్రాండ్‌స్లామ్ ఫైనల్ చేరడం ఇదే తొలిసారి. అప్పుడు ఆమె సెరెనా చేతిలో ఓడింది.
ఒసాకా కష్టపడి:
నవోమి ఒసాకా కష్టపడి ఫైనల్లో ప్రవేశించింది. సెమీఫైనల్లో ఆమె 7-6 (7/1), 3-6, 6-3తో జెన్నిఫర్ బ్రాడీ (అమెరికా)పై గెలిచింది. తొలి సెట్‌ను టైబ్రేకర్‌లో గెలుచుఉన్న ఆమె ఆ తర్వాత తడబడింది. బ్రాడీ ఎనిమిదో గేమ్‌లో నవోమి సర్వీస్ బ్రేక్ చేసి 5-3తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత సర్వీసు నిలబెట్టుకుని 6-3తో సెట్ గెలిచి మ్యాచ్‌లో అవకాశాలు సజీవంగా ఉంచుకుంది.
విజేతను తేల్చే మూడో సెట్ పోటాపోటీగానే సాగింది. కానీ మూడో సెట్లో 2-1తో ఉన్న సమయంలో ఒసాకా బ్రేక్ పాయింటు వచ్చింది. బ్రాడీ కొట్టిన బంతి కోర్టు అవతల పడిందని అంపైర్ నిర్ణయించడం వల్ల ఆమె సర్వీస్ బ్రేక్ అయి నవోమి 3-1తో ఆధిక్యంలోకి వెళ్లింది. నిజానికి బంతిలో అతి స్వల్ప భాగం కోర్టు లోపలే ఉన్నట్లు రిప్లేలో తేలింది. బ్రాడీ అప్పీల్ చేయకపోవడం ఒసాకాకు కలిసొచ్చింది. అదే జోరు కొనసాగించిన ఈ జపాన్ స్టార్ 6-3తో సెట్‌తో పాటు మ్యాచ్‌ను గెలిచి అజరెంకతో టైటిల్ పోరుకు సిద్ధమైంది.
మహిళల సింగల్స్ ఫైనల్ ఆదివారం(సెప్టెంబర్ 13న) జరగనుంది. భారత కాలమానం ప్రకారం తెల్లవారుజామున 1.30 గంటలకు ఆరంభమవుతుంది.
మహిళల డబుల్స్ విజేత..
మహిళల డబుల్స్ టైటిల్‌ను జ్వెనరెవా (రష్యా)-సిగ్మండ్ (జర్మనీ) జోడీ గెలుచుకుంది. ఫైనల్లో జ్వెనరెవా జంట 6-4, 6-4తో మెలికార్ (అమెరికా)-ఇఫాన్ (చైనా) జోడీని ఓడించింది.
-
CHAMPIONS.
— US Open Tennis (@usopen) September 11, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
🇩🇪 @laurasiegemund & 🇷🇺 @verazvonareva beat No. 3 seeds Melichar & Xu, 6-4, 6-4! #USOpen pic.twitter.com/gllwQohZ9g
">CHAMPIONS.
— US Open Tennis (@usopen) September 11, 2020
🇩🇪 @laurasiegemund & 🇷🇺 @verazvonareva beat No. 3 seeds Melichar & Xu, 6-4, 6-4! #USOpen pic.twitter.com/gllwQohZ9gCHAMPIONS.
— US Open Tennis (@usopen) September 11, 2020
🇩🇪 @laurasiegemund & 🇷🇺 @verazvonareva beat No. 3 seeds Melichar & Xu, 6-4, 6-4! #USOpen pic.twitter.com/gllwQohZ9g