ETV Bharat / sports

'డేటింగ్​లో ఓ అబ్బాయి నన్ను తిరస్కరించాడు' - Naomi Osaka latest news 2020

జపాన్​ టెన్నిస్​ ప్లేయర్​, గతేడాది ఆస్ట్రేలియా ఓపెన్​ విజేత నయోమి ఒసాకా.. తాజాగా తన వ్యక్తిగత జీవితంపై మాట్లాడింది. తన జీవితంలో తొలిసారి ఓ వ్యక్తితో డేటింగ్​కు వెళ్లి తిరస్కరణకు గురైనట్లు చెప్పింది. అప్పట్నుంచే ఎవరికీ ప్రేమ, ఆకర్షణ వంటి వాటిపై సలహాలు ఇవ్వాలనుకోవట్లేదని చెప్పింది.

Tennis Star Naomi Osaka Expressed that she once Rejected By A Man while went for dating
"ఓ అబ్బాయి డేటింగ్​లో నన్ను తిరస్కరించాడు"
author img

By

Published : Mar 21, 2020, 6:24 AM IST

కరోనా దెబ్బతో చాలా మంది ఆటగాళ్లు స్వీయ నిర్బంధంలోకి వెళ్లిపోతున్నారు. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా పలు టోర్నీలు రద్దయ్యాయి. ఈ నేపథ్యంలో ఖాళీ సమయాన్ని అభిమానులతో సామాజిక మాధ్యమాల వేదికగా మాట్లాడేందుకు, కుటుంబసభ్యులతో గడిపేందుకు ఇష్టపడుతున్నారు ప్లేయర్లు. తాజాగా ఇన్​స్టా వేదికగా నెటిజన్లతో కాసేపు ముచ్చటించింది జపాన్​ టెన్నిస్​ ప్లేయర్​ నయోమి ఒసాకా. ఈ సందర్భంగా పలు ఆసక్తికర విషయాలు చెప్పింది.

Naomi Osaka
టెన్నిస్​ ప్లేయర్​ నయోమి ఒసాకా

డేటింగ్​పై సలహాలు ఇవ్వలేను..

ఒక అభిమాని డేటింగ్​పై సలహా ఇవ్వాలని ఒసాకాను కోరాడు. అంతేకాకుండా తనకు ఎవరిమీదైనా క్రష్​ ఉంటే ఏం చేస్తుందో చెప్పాలని అడిగాడు. అయితే వాటిపై ఊహించని స్పందన ఎదుర్కొన్నాడా అభిమాని.

Naomi Osaka
నయోమి ఒసాకా

" నిజంగా చెప్పాలంటే వెళ్లమనే చెప్తా. అలా ఉండిపోతే ఏం వస్తుంది. గతంలో ఓ వ్యక్తి చేతిలో డేటింగ్​కు వెళ్లగా అతను నన్ను తిరస్కరించాడు. కాబట్టి ఈ ప్రశ్న నన్ను అడగపోవడం మంచిది"

--నయోమి ఒసాకా, టెన్నిస్​ ప్లేయర్​

ఫ్రెంచ్​ ఓపెన్​ వాయిదాపైనా ఈ ప్లేయర్​ స్పందించింది. ప్లేయర్లను సంప్రదించకుండా టోర్నీ తేదీలు ఎలా మారుస్తారని ప్రశ్నించింది. ఇటీవల భారత టెన్నిస్​ స్టార్​ సానియా మీర్జా సైతం ఇదే అభిప్రాయం వ్యక్తం చేసింది. మే నెలలో జరగాల్సిన ఈ టోర్నీ సెప్టెంబర్​ 20 నుంచి అక్టోబర్​ 4 వరకు జరగనున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు.

గతేడాది జరిగిన ఆస్ట్రేలియా ఓపెన్​లో ఒసాకా​ విజేతగా నిలిచింది. 22 ఏళ్ల ఈమె ప్రస్తుతం ప్రపంచ టెన్నిస ర్యాంకింగ్స్​లో 10వ స్థానంలో ఉంది.

Naomi Osaka
ఆస్ట్రేలియా ఓపెన్​తో నయోమి ఒసాకా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.