మానసిక దృఢత్వం వల్లే యూఎస్ ఓపెన్(US Open 2021) ఫైనల్లో గెలవగలిగానని బ్రిటన్ సంచలన తార ఎమ్మా రదుకాను చెప్పింది. "యూఎస్ ఓపెన్ గెలవడం ఓ కలలా ఉంది. మానసిక దృఢత్వం వల్లే ఈ విజయాన్ని సాధించగలిగాను. ఈ టోర్నీలో మ్యాచ్ మ్యాచ్‌కు మెరుగైన ప్రదర్శన చేయగలిగాను. ప్రణాళికలను అమలు చేయగలిగాను. ఈ గెలుపులో నా జట్టు పాత్ర ఎంతో ఉంది. నేనిక్కడితో ఆగిపోను. నాకింకా 18 సంవత్సరాలే. మరిన్ని టైటిళ్లు గెలవాలనే పట్టుదలతో ఉన్నా. టెన్నిస్ కోర్టులో ఉంటే ఇక దేని గురించి ఆలోచించను. నా దృష్టంతా ఆటపైనే ఉంటుంది. ఆ ఏకాగ్రత కూడా నా విజయంలో కీలకమైంది" అని ఎమ్మా(Emma Raducanu) చెప్పింది.
యూఎస్ ఓపెన్ ఫైనల్లో లెలా ఫెర్నాండెజ్‌పై(Emma Raducanu vs Leylah Fernandez) గెలిచి విజేతగా నిలిచిన రదుకాను.. మరియా షరపోవా (2004, వింబుల్డన్) తర్వాత గ్రాండ్‌స్లామ్ టైటిల్ గెలిచిన పిన్న వయస్కురాలిగా ఘనత సాధించింది.
ఇదీ చదవండి: